సమస్యల సుడిగుండంలో పేద పిల్లల విద్యాభ్యాసం
TeluguStop.com
నల్లగొండ జిల్లా:వంద మంది నిరుపేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ జడ్పీ పాఠశాలపై అధికారుల పర్యవేక్షణ కరువై దయనీయ స్థితికి చేరుకున్నా పట్టించుకునే నాథుడే లేడని నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం రావులపెంట గ్రామస్తులు వాపోతున్నారు.
గ్రామంలో సర్కార్ పాఠశాల శిథిలావస్థకు చేరుకొని ప్రమాదకరంగా మారినా బిక్కుబిక్కుమంటూ
అందులోనే విద్యాభ్యాసం చేస్తున్నారని,ప్రభుత్వ అధికారులకు,స్థానిక ప్రజా ప్రతినిధులకు ఈ బడి బాధలు పట్టకపోవడం శోచనీయం అంటున్నారు.
తరగతి గదుల పైకప్పు పెంకులు పలిగి పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే భయాందోళనల మధ్య తమ పిల్లలు చదువులు కొనసాగిస్తున్నారని, టాయిలెట్స్ రూమ్స్ సరిగ్గా లేకపోవడంతో ఆడపిల్లలు ఇళ్ళకు పోవాల్సిన దుస్తితి నెలకొందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పనులు పూర్తి చేయించి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
ఈ పాఠశాల అభివృద్ధికి కోసం గత ప్రభుత్వ హయాంలో మన ఊరి మనబడి పథకం కింద రూ.
కోటి మంజూరయ్యాయి.వీటితో తరగతి గదులు, టాయిలెట్స్ నిర్మాణంతో పాటు మిగతా మరమ్మతులు చేపట్టడానికి టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రారంభ దశలోనే పనులు ఆపివేశారు.
పనుల్లో వేగవంతం పెంచాలని కాంట్రాక్టర్లను ఆర్ అండ్ బి అధికారులు నోటీసులు పంపినప్పటికీ గత ప్రభుత్వంలో మంజూరైన పనులకు ఈ ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుందో చెయ్యదో అనే సందిగ్ధంలో పనులు చేయడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
దీనితో చెట్ల కిందనే పాఠాలు చెప్పాలసిన పరిస్థితి ఏర్పడింది.పాఠశాలలో మెరుగైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యంగా టాయిలెట్ రూమ్స్ లేక చాలా ఇబ్బంది అవుతుందని,తరగతి గదుల్లో విద్యుత్ సౌకర్యం లేక ఉక్కపోస్తుందని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్దులు
వేడుకుంటున్నారు.
పాఠశాల మొత్తం అస్తవ్యస్తంగా తయారైందని పాఠశాల హెచ్ఎం లక్ష్మణ్ నాయక్ఆవేదన వ్యక్తం చేశారు.
జెడ్పీ హైస్కూల్ తరగతి గదుల పై కప్పు పెంకులు పగిలిపోయాయి.టాయిలెట్స్ లేక విద్యార్థినిలు చాలా ఇబ్బంది పడుతున్నారని,మనఊరి మనబడి పథకం కింద నిధులు మంజూరు కాగా సంబంధిత కాంట్రాక్టర్ పనులు ప్రారంభ దశలోనే నిలిపివేశారు.
తరగతి గదులు మరియు టాయిలెట్స్ నిర్మాణం వెంటనే పూర్తి చేయించాలని కోరుతున్నారు.
రామ్ చరణ్ ఆ దర్శకుడిని నెగ్లేట్ చేశాడా..?