గోల్డ్‌స్టోన్ శ్రీనివాస్‌రావు కంపెనీల్లో ఈడీ సోదాలు.. టీఆర్ఎస్‌లో ఆందోళన

ఢిల్లీ మద్యం కుంభకోణంలో హైదరాబాద్‌కు చెందిన గోల్డ్‌స్టోన్ శ్రీనివాసరావు అలియాస్ చెన్నమనేని శ్రీనివాసరావుపై జరిగిన దాడులు అధికార పార్టీ టీఆర్‌ఎస్‌‌ను కలవర పెడుతున్నాయి.

కేసీఆర్ కుటుంబంతో ఆయనకున్న సంబంధాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.విచారణ ముమ్మరం కావడంతో కేసీఆర్ కుటుంబం కొంత ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.

రాజ్యసభ ఎంపీ జోగింపల్లి సంతోష్‌కుమార్‌ ఏడు కంపెనీలకు డైరెక్టర్‌గా ఉండగా, వాటితో పలు కంపెనీల్లో సంతోష్‌కుమార్‌, శ్రీనివాసరావు ఇద్దరూ డైరెక్టర్లుగా ఉన్నారు.

కొన్ని కంపెనీలు ఎనిమిది, తొమ్మిది నెలల్లోనే మూతపడ్డాయి.సంతోష్ కుమార్ 2016 మార్చిలో రాజ్యసభ సభ్యుడు కాగానే మిగితా కంపెనీలన్నింటికీ రాజీనామా చేశారు.

శ్రీనివాసరావుకు చెందిన కంపెనీ డైరెక్టర్ల బోర్డులో సంతోష్ కుమార్ ఉన్నారు.సంతోష్‌కుమార్‌ డైరెక్టర్‌గా ఉన్న అన్ని కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఈడీ, ఇతర కేంద్ర విభాగాలు ఇప్పుడు విచారణ జరుపుతున్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ కంపెనీల్లోని కొంతమంది కీలక వ్యక్తులను ఈడీ ఇప్పటికే ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. """/"/ ఇలా అనేక కంపెనీల బోర్డుల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కుటుంబానికి చెందిన పలువురు సభ్యులుగా ఉన్నారనే ఆరోపణలున్నాయి.

ఇవన్నీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని చిక్కుల్లో పడిసేలా ఉన్నాయి.తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉన్న నేప‌థ్యంలో ఈ దాడుల ప్రభావం ఎలా ఉంటుందోన‌న్న ఆందోళ‌న టీఆర్ఎస్‌ పార్టీలో ఉంది.

ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై మనీలాండరింగ్ విచారణలో భాగంగా శుక్రవారం దేశవ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ED తాజా దాడులు ప్రారంభించింది.

"""/"/ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని మరికొన్ని నగరాల్లోని మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సప్లై చైన్ నెట్‌వర్క్‌లకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

సోదాల అనంతరం లిక్కర్ పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి 12 మంది వ్యక్తులు, 18 కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది.