కేపీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్‌కు ఈడీ నోటీసులు

క‌ర్ణాట‌క పీసీసీ చీఫ్ డీకే శివ‌కుమార్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ నోటీసులు జారీ చేసింది.

మ‌నీ ల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని అధికారులు నోటీసులిచ్చారు.ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆయ‌నే సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు.

గ‌తంలో మ‌నీ ల్యాండ‌రింగ్ కేసుల‌తో పాటు ఆదాయ‌ప‌న్ను శాఖ న‌మోదు చేసిన కేసుల్లోనూ ఆయ‌న‌ను అధికారులు ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే.

ఈడీ అధికారుల విచార‌ణ‌కు పూర్తిగా స‌హ‌క‌రిస్తాన‌ని డీకే శివ‌కుమార్ తెలిపారు.చ‌ట్ట‌ప‌రంగా, రాజ‌కీయ ప‌రంగా తాను నిర్వ‌ర్తించాల్సిన విధుల‌ను మాత్రం ప‌క్క‌న పెట్ట‌లేన‌ని చెప్పారు.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాలు, రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర త‌న‌కు ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు.

ఈ నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాల అనంత‌రం ఈడీ విచార‌ణ‌కు స‌హ‌కరిస్తాన‌ని వెల్ల‌డించారు.

రేపే ప్రమాణ స్వీకారం .. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో వాషింగ్టన్‌‌కు చేరుకున్న ట్రంప్