Arvind Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ నోటీసులు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు( CM Arvind Kejriwal ) ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది.

ఈ మేరకు వచ్చే నెల 4వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

ఇప్పటికే ఢిల్లీ మద్యం కుంభకోణం( Delhi Liquor Scam ) మనీలాండరింగ్( Money Laundering ) కేసులో భాగంగా ఏడుసార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ( ED ) తాజాగా ఎనిమిదో సారి కేజ్రీవాల్ కు నోటీసులు ఇచ్చింది.

"""/" / అయితే ఇన్నిసార్లు సమన్లు పంపినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణ హాజరుకాలేదన్న సంగతి తెలిసిందే.

మరోవైపు ఈడీ నోటీసులను చట్ట విరుద్ధంగా జారీ చేస్తుందని కేజ్రీవాల్ పలుమార్లు ఆరోపించారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మే 31, శుక్రవారం2024