Rabindran : బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ కు ఈడీ లుకౌట్ నోటీసులు..!!

బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ ( Rabindran )కు మరో చిక్కు ఎదురైంది.మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఈడీ లుకౌట్ నోటీసులు( ED Lookout Notices ) జారీ చేసింది.

రవీంద్రన్ దేశం విడిచి వెళ్లకూడదని కీలక ఆదేశాలు ఇచ్చింది.ఇప్పటికే రవీంద్రన్ పై అన్ ఇంటిమేషన్ లుకౌట్ సర్క్యులర్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే.

మరోవైపు రేపు బైజూస్ కీలక సమావేశం జరగనుంది.రవీంద్రన్ ను సీఈవో పోస్ట్ నుంచి తప్పించాలని, కొత్త బోర్డు ఏర్పాటు వ్యవహారంపై షేర్ హోల్డర్లు అసాధారణ జనరల్ మీటింగ్ నిర్వహించనున్నారు.

కాగా తదుపరి విచారణ జరిగే వరకు ఈజీఎం తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు కావని కర్ణాటక హైకోర్టు( High Court Of Karnataka ) స్పష్టం చేసింది.

అనంతరం తదుపరి విచారణను మార్చి 13వ తేదీకి వాయిదా వేసింది.

BetWinner Reseña Y Reputación Del Sitio (MX): Análisis Estructurado Para Principiantes