వాహనాల రిజిస్ట్రేషన్ స్కాం కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ..
TeluguStop.com
వాహనాల రిజిస్ట్రేషన్ స్కాం కేసులో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాక్ ఇచ్చారు.
ఆయన నిర్ణయం తీసుకుంది.ఈ కేసుకు సంబంధించి రూ.
22.10 కోట్ల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
ప్రభాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డికి సంబంధించిన ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు.బీఎస్ 3 వాహనాల రిజిస్ట్రేషన్లో అవకతవకలు జరిగాయని ఈడీ ఆరోపిస్తోంది.
పీఎంఎల్ఏ కింద గతంలో ప్రభాకర్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది.ఈ కేసుకు సంబంధించి జటాధర ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సి.
గోపాల్ రెడ్డి అండ్ కో చెందిన ఆస్తులను కూడా అధికారులు అటాచ్ చేశారు.
అశోక్ లేలాండ్ నుంచి వాహనాలు కొనుగోలు చేసినట్లు ఈడీ గుర్తించింది.వాహనాల రిజిస్ట్రేషన్లో నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి బీఎస్ 4గా మార్చినట్లు అధికారులు గుర్తించారు.
నాగాలాండ్, కర్నాటక, ఏపీలో రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు విచారణలో తేలింది.ఆర్టీవో అధికారులే నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్స్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం వాటిల్లిందని అధికారులు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే వాహనాల కుంభకోణం కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోనూ, ఆయన అనుచరుడు గోపాల్ రెడ్డి ఇంట్లోనూ ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో ఈడీ అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.ఈరోజు జేసీ కంపెనీకి చెందిన 22.
10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది.జేసీ అనుచరుడు గోపాల్ రెడ్డి ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది.
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?