Kailash Gahlot : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు.. మరో ఆప్ మంత్రికి నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు( Delhi Liquor Scam Case )లో ఎన్‎ఫోర్స్‎మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది.

ఈ మేరకు ఢిల్లీకి చెందిన మరో ఆప్ నేతకు ఈడీ నోటీసులు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాశ్ గెహ్లాట్( Kailash Gahlot ) కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

ఆయన ఇవాళే విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.కాగా లిక్కర్ కుంభకోణం సమయంలో కైలాశ్ గెహ్లాట్ పలుమార్లు ఫోన్ నంబర్ మార్చారని ఈడీ పేర్కొంది.

"""/" / అదేవిధంగా మద్యం కేసులో నిందితుడుగా ఉన్న విజయ్ నాయర్( Vijay Nair ) కు గతంలో కైలాశ్ ఆశ్రయం ఇచ్చారని ఈడీ ఆరోపిస్తుంది.

అయితే ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

అవార్డుతో శివ కార్తికేయన్ ను సత్కరించిన ఆర్మీ అధికారులు.. ఈ హీరో రియల్లీ గ్రేట్!