ఏపీలో ఈసీ నిర్ణయం..విధుల్లోకి అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు..!

ఏపీలో ఎన్నికల కమిషన్( AP Election Commission ) కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను( Anganwadis,Contract Employees ) ఎన్నికల విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది.

ఈ క్రమంలోనే అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులను ఓపీఓలుగా నియమించాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నికల సిబ్బంది కొరత( Election Staff ) నేపథ్యంలో ఈసీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.

మరోవైపు ఎన్నికల విధుల్లో పాల్గొనే అన్ని కేటగిరీల వారికి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12డి ( Form 12D )జారీ గడువును వచ్చే నెల 1వ తేదీ వరకు పొడిగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

గతంలో రెవెన్యూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మాత్రమే ఎన్నికల విధుల్లో పాల్గొనేవారు.ఇప్పటివరకు అంగన్వాడీలు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనలేదు.

ఈ క్రమంలోనే ఆరోపణలు ఉన్న సిబ్బందిని ఎన్నికల విధుల్లోకి తీసుకోవద్దని జిల్లా అధికారులకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.