తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది.ఈ కాన్ఫరెన్స్ లో తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగుస్తుందని అధికారులు తెలిపారు.అలాగే 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

ఈ మేరకు సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేటతో పాటు భద్రాచలం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ కొనసాగనుందని అధికారులు వెల్లడించారు.

మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

అల్లు అర్జున్ కోసం పని చేసిన లాయర్ ఫీజు ఎంతో తెలుసా.. వామ్మో ఇంత తీసుకుంటారా?