అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ బదిలీ వేటు

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కీలక మార్పులు జరుగుతున్నాయి.ఈ క్రమంలో ఇప్పటికే రాష్ట్ర డీజీపీ సహా పలువురు అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే.

అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.ఈ మేరకు తక్షణమే విధుల నుంచి రిలీవ్ కావాలని కీలక ఆదేశాలు జారీ చేసింది.

దాంతోపాటు ఎన్నికల విధులను అప్పగించవద్దని ఈసీ స్పష్టం చేసింది.మరోవైపు అనంతపురం అర్బన్ డీఎస్పీగా టీవీవీ ప్రతాప్ కుమార్ ను రాయచోటి డీఎస్పీగా రామచంద్రరావును నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే ఇవాళ రాత్రి 8 గంటల్లోగా బాధ్యతలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది.

బన్ మస్కా అండ్ చాయ్ ట్రై చేసిన బ్రిటిష్ మహిళ.. రియాక్షన్ ఇదే..??