‘నోటా’ ఎఫెక్ట్‌.. విజయ్‌ దేవరకొండకు ఈసీ ఆఫర్‌

విజయ్‌ దేవరకొండకు తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉందనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

తెలుగు రాష్ట్రాల్లో విజయ్‌ దేవరకొండకు ఉన్న ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం చిత్రాతో స్టార్‌ డం దక్కించుకున్న విజయ్‌ దేవరకొండను తెలంగాణ ఎన్నికల కమీషన్‌ కూడా వాడేసుకోవాలని నిర్ణయించుకుంది.

తాజాగా ‘నోటా’ చిత్రంలో నటించిన విజయ్‌ దేవరకొండ ఆ చిత్రంలో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చాడు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఆ సినిమా ఫలితం తారు మారు అయినా కూడా ఆ సినిమా ఇచ్చిన సందేశం అన్ని విధాలుగా ఆకట్టుకుంది.

అందుకే విజయ్‌ దేవరకొండను మహబూబ్‌ నగర్‌ జిల్లా కలెక్టర్‌ ఓటర్ల చైతన్య పర్చేందుకు విజయ్‌ దేవరకొండను బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసినట్లుగా సమాచారం అందుతుంది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ పలు రంగాలకు చెందిన ప్రముఖులను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసుకుంది.

తాజాగా విజయ్‌ దేవరకొండ ఆ జాబితాలో చేరిపోయాడు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా మాజీ క్రికెటర్‌ వివిఎస్‌ క్ష్మణ్‌, సానియా మీర్జా, గోరేటి వెంకన్న, పుల్లెల గోపీచంద్‌లను ఎంపిక చేయడం జరిగింది.

తాజాగా వీరితో పాటు విజయ్‌ దేవరకొండ కూడా ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనేందుకు చైతన్యపర్చబోతున్నారు.

విజయ్‌ దేవరకొండపై రెండు మూడు యాడ్‌ ఫిల్మ్స్‌ను కూడా చిత్రీకరించేందుకు ఎన్నికల కమీషన్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఈసారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.

మరి ఈ జనాల్లో మాత్రం మార్పు వచ్చేనా చూడాలి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్22, ఆదివారం 2024