నాగబాబు వ్యాఖ్యలలో వాస్తవం లేదని తేల్చి చెప్పిన ఈసీ..!!

జనసేన నాయకుడు నాగబాబు( Nagababu ) ఇటీవల ఓ వీడియో విడుదల చేయడం జరిగింది.

ఆ వీడియోలో వైసీపీ నాయకులు( YCP Leaders ) డబ్బులు ఆశ చూపి ముందుగానే చేతి వేలికి సిరా చుక్క పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

నాగబాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన ఈ వీడియో పై ఏపీ సీఈఓ కార్యాలయం స్పందించింది.

జనసేన నేత నాగబాబు వ్యాఖ్యలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఖండించింది.అంతేకాకుండా ఒక సమాచారం షేర్ చేస్తున్నప్పుడు ఖచ్చితమైనదా కాదా అన్నది ముందే నిర్ధారించుకోండి.

నిజాలను పోస్ట్ చేయండి.అందరం కలిసి ఓటింగ్ ప్రక్రియను ప్రోత్సహిద్దాం అని ఈసీ ట్వీట్ చేసింది.

"""/" / అంతేకాకుండా పిఠాపురం( Pithapuram ) అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిక వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ ఈ ఆరోపణలు నిజం కావని వీడియో సందేశంలో స్పష్టం చేశారని ఏపీ సీఈఓ కార్యాలయం పేర్కొంది.

భారత ఎన్నికల సంఘం( Election Commission Of India ) నియమించిన అధికారులు మాత్రమే చెరగని సిరాను వాడే అధికారం కలిగి ఉన్నారని స్పష్టం చేసింది.

ఒకవేళ ఎవరైనా ఇతర సిరాల ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

2019 ఎన్నికలలో నరసాపురం ఎంపీగా నాగబాబు పోటీ చేసి ఓడిపోయారు.ఈసారి అనకాపల్లి నుండి పోటీ చేయాలని భావించగా ఆఖరి నిమిషంలో పోటీ నుండి తప్పుకుని ప్రచారానికి పరిమితం కావడం జరిగింది.

తండేల్ సక్సెస్ అవుతుందా..? దీనిమీద అల్లు అరవింద్ ఎలాంటి హోప్స్ పెట్టుకున్నాడు…