తిరుపతి పోలీసు అధికారులకు ఈసీ నోటీసులు..!!
TeluguStop.com
ఏపీలో ఎన్నికల పోలింగ్ తరువాత జరిగిన అల్లర్లపై తిరుపతి(Tirupati) పోలీసు అధికారులకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇచ్చింది.
ఈ మేరకు పోలీసులకు నోటీసులు అందజేసిన ఈసీ ఐటీ ఉద్యోగులపై కేసులు నమోదు చేయడానికి గల కారణాలు చెప్పాలని పేర్కొంది.
అయితే పోలింగ్ జరిగిన రోజు రాత్రి చంద్రగిరి మండలంలోని కూచివారిపల్లి, రామిరెడ్డిపల్లిలో(Kuchivaripalli, Ramireddypalli) దాడులు జరిగాయి.
ఈ క్రమంలోనే దాడుల ఘటనల నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరులో (Bangalore, Hyderabad)పని చేస్తున్న పలువురు ఐటీ ఉద్యోగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తాము ఓటు హక్కును వినియోగించుకునేందుకు వస్తే కేసులు పెట్టారని ఐటీ ఉద్యోగులు, కొందరు వైద్యులు ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఉద్యోగుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈసీ తిరుపతి పోలీస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది.
మళ్లీ ఆ వ్యవస్థను ప్రవేశపెట్టబోతున్న రేవంత్ ?