మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డికి ఈసీ నోటీసులు జారీ చేసింది.ఈ మేరకు రేపు మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది.

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రచారం చేపట్టారు.దీనిలో భాగంగా టీఆర్ఎస్ కు ఓటు వేయకపోతే పథకాలు ఆగిపోతాయని మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యనించినట్లు సమాచారం.

ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది.మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను ఎన్నికల సంఘం సుమోటోగా తీసుకుంది.

ఈ క్రమంలోనే ఆయనకు ఈసీ అధికారులు నోటీసులు అందించారు.నోటీసులకు వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి2, గురువారం2025