జగన్ కు దెబ్బ మీద దెబ్బ ? ఆ కీలక అధికారే నిమ్మగడ్డ టార్గెట్ ?

ఏపీ ఎన్నికల అధికారి  నిమ్మగడ్డ రమేష్ కుమార్, వైసీపీ ప్రభుత్వం మధ్య ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఇంకా వార్ నడుస్తూనే ఉంది.

ఒకరిని దెబ్బతీసే విధంగా మరొకరు వ్యూహాలు రచిస్తూ వ్యవహరిస్తున్న తీరుతో ఏపీలో నిత్యం రాజకీయ అలజడి రేగుతూనే ఉంది.

ప్రస్తుతం నామినేషన్ల ఘట్టం మొదలైంది.ఏకగ్రీవాలపైనే ఎక్కువగా ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.

ఎక్కువగా ఏకగ్రీవాలు చేసుకోవడం ద్వారా, వైసీపీ ఎన్నికలకు వెళ్ళకుండానే అత్యధిక స్థానాలను దక్కించుకునే విధంగా జగన్ ప్లాన్ చేస్తూ వస్తున్నారు.

అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ సైతం తనకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన అధికారాలతో ఏపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతున్నట్టు గానే వ్యవహరిస్తున్నారు.

ముఖ్యంగా జగన్ ప్రభుత్వం కీలక అధికారిగా పని చేస్తున్న జగన్ కు సన్నిహితమైన అధికారులపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తున్నారు.

ఇప్పటికే అటువంటి అధికారులను గుర్తించి వారందరినీ బదిలీ చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చిన నిమ్మగడ్డ రమేష్ కుమార్, ఇప్పుడు జగన్ కు అత్యంత నమ్మకమైన, సన్నిహితమైన అధికారిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై ఎక్కువగా ఫోకస్ పెంచినట్టు గా కనిపిస్తున్నారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శిగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాష్ ఆ విధుల నుంచి తప్పించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్  దాస్ కు తాజాగా లేఖ రాసినట్లు తెలుస్తోంది.

వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి ప్రవీణ్ ప్రకాష్ జగన్ కు స్నేహితుడిగానే కాకుండా, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలు రూపకల్పనలో ప్రవీణ్ ప్రకాష్ పాత్రా ఉంది.

దీనికి తోడు అత్యంత సమర్థవంతమైన అధికారిగా ఆయనకు పేరు ఉండటంతో ఇప్పుడు ఆయనపై ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తున్నారు.

"""/"/ ప్రస్తుతం ఈసీ నిర్ణయం జగన్ కోటరీలో పెద్ద కలకలం రేపుతోంది.ఇప్పటికే చిత్తూరు, గుంటూరు జిల్లాల కలెక్టర్లను, తిరుపతి అర్బన్ పోలీస్ సూపరిండెంట్ ను ఆ విధుల నుంచి తప్పించి వేరే విభాగాలకు బదిలీ చేసినప్పటికీ, ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ పైనా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫోకస్ పెట్టడం సంచలనంగా మారింది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్ కార్యదర్శి గా రవిచంద్రను నియమించుకునేందుకు ప్రయత్నించగా, ప్రభుత్వం అడ్డుకోవడంతో ఆయన ప్రవీణ్ ప్రకాష్ ను టార్గెట్ చేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఏది ఏమైనా ఎన్నికలు తంతు ముగిసే వరకు నిమ్మగడ్డ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్లుగా వరుసగా ఈ తరహా వివాదాలు చోటు చేసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పవన్ కు ప్రాధాన్యం పెంచేస్తున్న బీజేపీ ! కారణం ఏంటో ?