Rahul Gandhi : మాట తీరు విషయంలో రాహుల్ గాంధీకి ఈసీ కీలక సూచన..!!

దేశంలో మరో 40 రోజుల్లో పార్లమెంటు ఎన్నికలు( Parliament Elections ) జరగనున్నాయి.

ఈ క్రమంలో రాజకీయ నేతలు తమ ప్రసంగాలలో వాడి వేడి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు.

దీన్ని ఒక కంట కనిపెడుతున్న ఎలక్షన్ కమిషన్ పలు పార్టీలకు సూచనలు చేస్తూ ఉంది.

ప్రసంగాలు చేస్తున్న సమయంలో నేతలు సంయమనం పాటించాలని సూచించింది.తాజాగా ఈ రకంగానే కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ( Congress Rahul Gandhi )కి ఈసీ కీలక సూచన చేసింది.

బహిరంగ ప్రసంగాలలో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. """/" / గత ఏడాది గతేడాది రాజస్థాన్‌లోని జలోర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని "పనౌటీ( Panouti Modi )" అని పిలిచారు.

దేశానికి మోదీ అపశకునం అన్నట్టు వ్యాఖ్యానించారు.అందుకే 2023లో అహ్మదాబాద్‌లో జరిగిన ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

ఆ తర్వాత మయన్మార్‌లో జరిగిన మరో ర్యాలీలో మోదీని పిక్‌పాకెట్‌గా అభివర్ణించారు.జేబు దొంగలు ఒంటరిగా రారని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై ఢిల్లీ హైకోర్టు( Delhi High Court ) అభ్యంతరాలు తెలపడం జరిగింది.

అంతేకాదు రాహుల్ గాంధీ పై చర్యలు తీసుకోవాలని ఈసీని సూచించింది.దీనిలో భాగంగా రాహుల్ కి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేయడం జరిగింది.

ఆ నోటీసులలో ఇకపై సభలలో సమావేశాలలో జాగ్రత్తగా మాట్లాడాలని కోరింది.

సివిల్స్ కు ప్రిపేర్ అవ్వాలనుకుంది.. ఒలింపిక్స్ మెడల్ సాధించింది.. మను భాకర్ సక్సెస్ కు వావ్ అనాల్సిందే!