ఈబీ-5 వీసా ఫీజు పెంపు: భారతీయుల జేబుకు చిల్లే

ఏప్రిల్ 1 నుంచి అమెరికాకు వలస వెళ్లాలనుకునే భారతీయులకు ఇమ్మిగ్రేషన్ రుసుము కింద జేబులకు చిల్లులు పడనుంది.

ఈబీ-5, ఇన్వెస్టర్ వీసా కోసం అదనంగా 50,000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.ఈ అదనపు రుసుము అన్ని వీసా కేటగిరీలపై ప్రభావం చూపుతున్నప్పటికీ ప్రధానంగా ఈబీ-5 వీసా కింద పెట్టుబడులు పెట్టే వారికి అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని అమెరికన్ బజార్ దినపత్రిక తన కథనంలో ప్రచురించింది.

ఈ ఏడాది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రామ్‌లో భాగంగా కనీస పెట్టుబడిని 1990ల తర్వాత 9,00,000లకు పెంచింది.

కనీస పెట్టుబడిలో ఈ పెరుగుదలలో 5 శాతం అదనపు పన్నును దరఖాస్తుదారులు తమ దరఖాస్తు ప్రక్రియ కోసం అమెరికాలో ఎస్క్రోఖాతాకు చెల్లించాల్సి ఉంటుంది.

అమెరికాకు వెళ్లేముందు భారతీయులు తమ పన్ను స్థితిని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అమెరికన్ బజార్ గ్లోబల్ ఛైర్మన్ మార్క్ డేవిస్ అన్నారు.

"""/"/ చైనా, వియత్నాం, భారతీయుల నుంచి ఈ వీసాకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

హెచ్ 1 బీ వీసాల ద్వారా గ్రీన్‌కార్డు లభించడం ఇటీవల పదేళ్లకుపైనే పడుతోంది.

అదే ఈబీ 5 వీసా ద్వారా దరఖాస్తు చేస్తే 3 నుంచి 5 ఏళ్లలోనే గ్రీన్‌కార్డ్ లభిస్తుంది.

దీంతో సంపన్న భారతీయులతో పాటు హెచ్ 1 బీ వీసాలపై వెళ్లి అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న భారతీయుల్లో ఎక్కువ మంది ఈ వీసాలపై ఆసక్తి చూపిస్తున్నారు.

అమెరికాలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు పెంచేందుకు 1993లో ఈబీ-5 వీసా పథకాన్ని ప్రారంభించారు.

ఈ విధానంలో కనీసం 10 ఉద్యోగాలు కల్పించేలా 5 లక్షల డాలర్ల కనీస పెట్టుబడి పెట్టే విదేశీయులకు ఈ వీసాల కింద గ్రీన్‌కార్డ్ జారీ చేస్తారు.

కిరాణా వస్తువులు కొందామని షాప్‌కి వెళ్లాడు.. రూ.4 కోట్లతో తిరిగొచ్చాడు..??