భోజనం తర్వాత దీన్ని తింటే ఒంట్లో కొవ్వు ఈజీగా కరిగిపోద్ది..తెలుసా?
TeluguStop.com
కొందరికి భోజనం చేసిన కొద్ది సేపటికే మళ్లీ ఆకలి వేసేస్తుంటుంది.ఆ ఆకలిని అస్సలు కంట్రోల్ చేసుకోలేరు.
దాంతో చేసేదేమి లేక ఇంట్లో ఉండే కేకులు, స్వీట్స్, చిప్స్ వంటి చిరుతిండ్లపై పడుతుంటారు.
ఫలితంగా ఒంట్లో కొవ్వు క్రమంగా పేరుకుపోతుంది.ఇక కొవ్వు పెరిగాక కరిగించుకోవడం కాస్త కష్టంతో కూడుకున్న పనే.
అయినప్పటికీ సరైన పద్ధతిని పాటిస్తే సూపర్ ఫాస్ట్‌గా ఒంట్లో కొవ్వును తగ్గించుకోవచ్చు.ముఖ్యంగా అందుకు బంగాళదుంప అద్భుతంగా సహాయపడుతుంది.
సాధారణంగా బంగాళదుంప తింటే బరువు పెరుగుతారని చాలా మంది నమ్ముతుంటారు.కానీ, ఇప్పుడు చెప్పబోయే విధంగా బంగాళదుంపను తీసుకుంటే ఒంట్లో కొవ్వు ఈజీగా కరిగిపోద్ది.
మరి ఆలస్యమెందుకు బంగాళ దుంపను ఎలా తీసుకోవాలో చూసేయండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని.
అందులో గ్లాస్ వాటర్ మరియు చిన్న బంగాళదుంప వేసి ఉడికించాలి.బంగాళదుంప బాగా ఉడికిన తర్వాత పైపొట్టు తొలగించి మెత్తగా స్మాష్ చేసుకోవాలి.
ఇప్పుడు స్మాష్ చేసుకున్న బంగాళదుంపలో నాలుగు స్పూన్ల పెరుగు, చిటికెడు నల్ల మిరియాల పొడి, చిటికెడు వాము పొడి వేసి మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని భోజనం చేసిన అనంతరం తినాలి.ఇలా చేయడం వల్ల భోజనం త్వరగా జీర్ణం అవుతుంది.
శరీరంలో పేరుకు పోయిన కొవ్వు కరుగుతుంది.అదే సమయంలో అతి ఆకలి సమస్య తగ్గు ముఖం పట్టి చిరు తిండ్లపై మనసు మల్లకుండా కూడా ఉంటుంది.
ఫలితంగా మీరు వెయిట్ లాస్ అవుతారు. """/" /
ఇక బంగాళదుంపను పైన చెప్పిన విధంగా తీసుకుంటే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, అజీర్తి వంటి జీర్ణ సంబంధిత సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఇక గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే పైన చెప్పిన బంగాళదుంప మిశ్రమాన్ని ఎక్కువ మోతాదులో మాత్రం తీసుకోరాదు.
వీడియో: ఈ చిన్నారి ఎంత డ్రామా చేస్తుందో చూస్తే నవ్వాపుకోలేరు..