అక్కడ పాన్ వేసుకోవడమే మహాపాపం.. పాన్ నమిలితే ఏ శిక్షలు ఉంటాయో తెలిస్తే అవాక్కవుతారు
TeluguStop.com
కడుపు నిండా బోజనం చేసి, ఒక పాన్ వేసుకుంటే తిన్న బోజనం అంతా కూడా ఈజీగా జీర్ణం అవుతుందని ఇండియాలో ఎక్కువ శాతం మంది పాన్‌లు వేసుకుంటారు.
ముఖ్యంగా మాంసాహారం తీసుకున్న సమయంలో జనాలు పాన్‌లు వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు.సౌత్ ఇండియాలో కాస్త తక్కువ అయినా నార్త్ ఇండియాలో పాన్‌ల సాంప్రదాయం చాలా ఏళ్లుగా వస్తుంది.
పాన్ వేసుకోవడం తప్పు లేదు, కాని పాన్ వేసుకున్న తర్వాత ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ గలీజ్‌గా ఉమ్మి వేయడం జరుగుతుంది.
కాని లండన్‌లో అలా చేస్తే ఊరుకోరు.లండన్‌లో ఒక ప్రాంతంలో గుజరాత్‌కు చెందిన వారు పెద్ద ఎత్తున ఉంటారు.
గుజరాతీయులు పాన్ ప్రియులు.దాంతో అక్కడ పాన్ సంమృద్దిగా లభిస్తుంది.
పాన్ తినే విషయంలో లండన్ ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదు.కాని పాన్ నమిలి గలీజ్‌గా రోడ్లపై, గోడలపై ఉమ్మి వేయడం జరుగుతుంది, దాన్ని నిర్మూలించేందుకు కఠిన శిక్షలు అమలు చేస్తున్నారు.
పరిశుభ్రతకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చే లండన్ అధికార ప్రతినిధులు తాజాగా పాన్ తిని రోడ్లపై ఉమ్మి వేసే వారిపై కఠిన శిక్షలు అమలు చేసేందుకు సిద్దం అయ్యారు.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/
పాన్ నమిలి రోడ్డు మీద ఉమ్మినట్లుగా నిరూపితం అయితే మొదటి సారి ఇండియన్ కరెన్సీ ప్రకారం 15 వేల రూపాయల జరిమానా, ఆ తర్వాత అదే వ్యక్తి మళ్లీ పాన్ ఉమ్మినట్లుగా నిరూపితం అయితే జైలు శిక్ష.
అది కూడా దాదాపు ఆరు నెలల జైలు శిక్షను విధించాలని నిర్ణయించారు.రోడ్డు మీద పాన్ ఉమ్మవద్దని చెప్పడం మంచిగానే ఉన్నా, ఇలా కఠిన శిక్షలను అమలు చేయడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఎన్నారైలు తమ హక్కులకు భంగం కలిగించేలా స్థానిక ప్రభుత్వం వ్యవహరిస్తుందని వారు గ్రహంతో ఉన్నారు.
ప్రభుత్వం చేసిన పనిని అంతా కూడా అభినందిస్తున్నారు.పరిశుభ్రం కోసం అంతకు మించి ఏం చేస్తారని అంటున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్27, ఆదివారం2025