బెల్లాన్ని ఇలా తింటే ఇన్ని రకాల.. అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చా..?

ప్రస్తుత సమాజంలోని ప్రజలకు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది.అందుకోసం చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.

డయాబెటిస్ ఉన్న వారు పంచదారకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.

బెల్లం( Jaggery ) లో క్యాల్షియం, పొటాషియం, సోడియం, ఐరన్ వంటి పోషకాలు ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

రోజు కొంత మోతాదులో బెల్లం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

"""/" / అలాగే బెల్లాన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు ( Health Problems )చెక్ పెట్టవచ్చు.

ఇంకా ఎటువంటి ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణ ఎంజైములను ప్రేరేపిస్తుంది.

దీని వల్ల జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది.దీంతో అజీర్ణం మల బద్ధకం( Constipation ), గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఇందులో క్యాల్షియం, ఐరన్ వంటి కంటెంట్ ఎక్కువగా ఉంటాయి.అలాగే రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.

ముఖ్యంగా చెప్పాలంటే పీరియడ్స్( Period Pain) సమయంలో వచ్చే నొప్పి వంటి వాటి నుంచి ఉపశమనం పొందడానికి బెల్లం ఎంతగానో ఉపయోగపడుతుంది.

"""/" / అలాగే క్రమం తప్పకుండా బెల్లం తింటే రక్తం శుభ్రం అవుతుంది.

అలాగే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.దీంతో చర్మం పై ఉండే పింపుల్స్, ( Pimples )చర్మ వ్యాధులు నివారించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

బెల్లం( Jaggery ) లో ఇనుము కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.

రక్తహీనతతో బాధపడేవారు బెల్లాన్ని రెగ్యులర్ గా తినడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుకోవచ్చు.

ఇంకా చెప్పాలంటే బెల్లంలో కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల నెమ్మదిగా శక్తిని విడుదల చేస్తుంది.

దీని వల్ల ఆ రోజంతా తాజాగా ఉండవచ్చు.భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

డ్రై హెయిర్ తో డోంట్ వర్రీ.. ఒక్క వాష్ తో రిపేర్ చేసుకోండిలా!