క్యారెట్‌ను ఈ విధంగా తీసుకుంటే మీ బాన పొట్ట ఫ్లాట్‌గా మారడం ఖాయం!

రుచిక‌ర‌మైన మ‌రియు ఆరోగ్య‌క‌ర‌మైన దుంపల‌ జాబితా తీస్తే.క్యారెట్ ముందు వ‌ర‌స‌లో ఉంటుంది.

క్యారెట్‌ చ‌వ‌క ధ‌ర‌కు ల‌భించ‌మే కాదు.దానిలో విటమిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, విట‌మిన్ బి, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, ప్రోటీన్‌, ఫైబ‌ర్ త‌దిత‌ర పోష‌కాలు పుష్కలంగా నిండి ఉంటాయి.

అందుకే ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్యారెట్ల విన‌యోగం కూడా చాలా ఎక్కువ అని అంటుంటారు.అయితే ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉప‌యోగ‌ప‌డే క్యారెట్‌.

బ‌రువును త‌గ్గించ‌డానికి కూడా గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.ముఖ్యంగా ఇప్పుడు చెప్ప‌బోయే విధంగా క్యారెట్ ను తీసుకుంటే మీ బాన పొట్ట ఫ్లాట్‌గా మార‌డం ఖాయం.

మ‌రి ఇంకెందుకు లేటు క్యారెట్‌ను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా ఒక క్యారెట్ ను తీసుకుని పీల్ తొల‌గించి వాట‌ర్ లో శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేయాలి.

ఇప్పుడు స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, కొద్ది వాట‌ర్ వేసి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.

"""/" / ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఉడికించి చ‌ల్లార‌బెట్టుకున్న క్యారెట్ ముక్క‌లు, మూడు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, చిన్న ప‌చ్చి ప‌సుపు కొమ్ము ముక్క, వ‌న్ టేబుల్ స్పూన్ పీన‌ట్ బ‌ట‌ర్‌, హాఫ్ టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, కొద్దిగా వాట‌ర్ వేసుకుని మెత్త‌టి పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్ ను పోయాలి.

పాలు బాగా హీట్ అవ్వ‌గానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ మిశ్ర‌మాన్ని వేసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడికిస్తే.

క్యారెట్ ట‌ర్మ‌రిక్ మిల్క్ సిద్ధం అవుతుంది.ఈ మిల్క్‌ను ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌కు గంట ముందు లేదా రాత్రి ప‌డుకోవ‌డానికి గంట ముందు తీసుకోవాలి.

ఇలా రోజు తీసుకుంటే.పొట్ట వ‌ద్ద పేరుకుపోయిన కొవ్వు మొత్తం క్ర‌మంగా క‌రిగిపోతుంది.

దాంతో మీ బాన పొట్ట ఫ్లాట్‌గా, నాజూగ్గా మారుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూలై23, మంగళవారం 2024