ఈ పండ్లను రోజుకు 2 తింటే చాలు షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం!
TeluguStop.com
సాధారణంగా కొన్ని పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు కంటే ఎండిన తర్వాత తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి.
డ్రై అంజీర్ ఈ కోవకే చెందుతాయి.అంజీర్( Anjeer ) ను అతి పండ్లు అని కూడా పిలుస్తుంటారు.
అయితే పండుగా ఉన్నప్పుడు కంటే ఎండిన తర్వాత తీసుకుంటేనే అంజీర్ వల్ల అధిక లాభాలు పొందుతారు.
ముఖ్యంగా రోజుకు రెండు అంజీర్ పండ్లను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే షుగర్ కంట్రోల్ నుంచి వెయిట్ లాస్ వరకు ఎన్నో బెనిఫిట్స్ మీ సొంతం అవుతాయి.
"""/" /
అందుకోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకుని అందులో రెండు డ్రై అంజీర్ పండ్లను వేసుకోవాలి.
ఆపై గ్లాస్ నిండా వాటర్ పోసుకుని మూత పెట్టి నైట్ అంతా నానబెట్టుకోవాలి.
మరుసటి రోజు ఉదయాన్నే నానబెట్టుకున్న అంజీర్ పండ్లు తినడమే కాకుండా ఆ వాటర్ ని కూడా సేవించాలి.
ఇలా ప్రతిరోజు చేస్తే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ముఖ్యంగా అంజీర్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.
ఇది మన జీర్ణవ్యవస్థ( Digestion )ను చురుగ్గా మారుస్తుంది.మలబద్దకం సమస్యకు చెక్ పెడుతుంది.
అలాగే అంజీర్ పండ్లను నైట్ అంతా నానబెట్టి ఉదయం వాటర్ తో సహా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి.
చాలామంది ఓవర్ వెయిట్ తో బాధపడుతున్నారు.అలాంటి వారికి డ్రై అంజీర్( Dry Anjeer ) ఒక వరం అనే చెప్పుకోవచ్చు.
రోజు పైన చెప్పిన విధంగా అంజీర్ పండ్లను తీసుకుంటే మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.
దాంతో కేలరీలు కరిగే వేగం పెరిగి త్వరగా బరువు తగ్గుతారు. """/" /
అంతేకాదు అంజీర్ పండ్లను నానబెట్టి ఉదయం తీసుకోవడం వల్ల అందులోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి.
అలాగే అంజీర్ పండ్లు రక్తపోటు( Blood Pressure )ను అదుపులో ఉంచుతాయి.గుండెకు ముప్పును తగ్గిస్తాయి.
కంటి చూపును మెరుగుపరిస్తాయి.రక్తహీనత బారిన పడకుండా రక్షిస్తాయి.
ఎముకలను, కండరాలను సైతం బలోపేతం చేస్తాయి.
ఆ పని మరే హీరో చేయలేరు… అల్లు అర్జున్ దమ్మున్న హీరో: రష్మిక