మెదడు చురుగ్గా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలు తీసుకోండి
TeluguStop.com
మనం తినే ఆహారంపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.మంచి పోషకాలు, విటమిన్లు అందించే ఆహారం తీసుకుంటే శరీరం యాక్టివ్‌గా పనిచేస్తూ ఉంటుంది.
అలాగే శరీరంలోని అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి.మన శరీరంలో మెదడు( Brain ) కీలక పాత్రను పోషిస్తుంది.
ఆలోచించే శక్తిని మనకు అందిస్తుంది.అలాంటి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం.
"""/" /
స్టాబెర్రీలు( Strawberry ) మెదడు చురుగ్గా పనిచేయడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
స్టాబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లతో పాటు అనేక పోషక విలువలు ఉంాయి.ఇది మెదడు మందగించడం, న్యూరోడెజెనరేటివ్ వంటి వ్యాధుల నుంచి రక్షిస్తాయి.
ఇక పసుపు కూడా మెదడు మెరుగ్గా పనిచేయడానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
పసుపులో( Turmeric ) కర్కుమిన్ యాంటీ ఇన్లమేటరీ, యాంటీ క్యాన్సర్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఉంటాయి.
ఇవి శరీరానికి, మెదడుకు బాగా ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది.అలాగే ఆకుకూరలు కూడా మెదడు చురుగ్గా పనిచేయడానికి బాగా సహాయపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
"""/" /
ఆకుకూరల్లో విటమిన్ కె, సి, ఇ ఉన్నాయి.ఇవి మెదడు కణాలను పునరుత్పత్తి చేయడంలో ఉపయోగపడతాయట.
ఇక బాదం, వాల్ నట్స్‌లో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.ఇవి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీరాన్ని రక్షిస్తాయి.
అలాగే మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.అలాగే అవకాడోస్‌లో( Avocados ) విటమిన్లు, ఫోలేట్ లాంటి పదార్ధాలు ఉంటాయి.
ఇవి బలహీనతను తగ్గించడంతో సహాయపడతాయి.వీటితో పాటు తాజా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటూ ఉండాలి.
దీని వల్ల మెదడు పనితీరు మెరుగు పడటంతో పాటు యాక్టివ్‌గా పనిచేస్తుంది.మంచి ఆహారం తీసుకోవడం వల్ల మెదడు బాాగా పనిచేస్తుంది.
దీని వల్ల మంచి ఆలోచనలు వస్తాయి.ఎంతో క్రియేటివిటీతో పనిచేయగలుగుతారు.