అన్నం తినో అటుకులు తినో ! మళ్లీ సెంటిమెంట్ రాజేస్తున్న కేసీఆర్ 

ప్రత్యేక తెలంగాణ ను సాధించేందుకు ఏ విధమైన సెంటిమెంటును ఉపయోగించి సక్సెస్ అయ్యారో ఇప్పుడు అదే సెంటిమెంట్ ను ఉపయోగించి సక్సెస్ అవ్వాలనే ఆలోచనకు వచ్చేశారు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ).

అందుకే మరోసారి తెలంగాణ సార్వత్రిక ఎన్నికలతో పాటు, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే విధంగా బీఆర్ఎస్( BRS ) శ్రేణుల్లో ఉత్సాహం పెంచే వ్యూహానికి తెర తీశారు.

దీనిలో భాగంగానే పార్టీ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు.' ఆప్ కీ బార్ కిసాన్ సర్కార్( Op Key Bar Kisan Sarkar ) ' నినాదంతో ముందుకు వెళ్దామంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు.

అలాగే సెంటిమెంట్ ను రగిల్చే ప్రయత్నం చేస్తూ, గత తెలంగాణ ఉద్యమాన్ని మళ్లీ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

'' అన్నం తినో అటుకులు తినో ఉపవాసం ఉండో 14 ఏళ్లు పేగులు తెగేదాకా కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.

అధికారం లేకుండా ఉద్యమ కాలంలో జెండా భుజాలు వేసుకుని లాఠీలకు, జైలుకు వెరవకుండా రేయింబవళ్లు శ్రమించి పార్టీని కాపాడుకున్న ఘనత గులాబీ సైనికులకే దక్కుతుంది.

"""/" / ప్రజల ఆశీర్వాదం, నిబద్ధత కలిగిన లక్షలాది కార్యకర్తల అసమాన కృషితో అపురూప విజయాలు సాధించి, రెండు సార్లు బీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది.

పట్టుదల అంకితభావంతో పనిచేస్తూ కార్యకర్తల బలంతోనే 60 లక్షల సభ్యత్వంతో అజేయమైన శక్తిగా బీఆర్ఎస్ ఎదిగింది.

పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా ఎవరికి సాధ్యం కానీ ఏకపక్ష విజయాలు సాధిస్తూ, రికార్డులను తిరగరాసి 21 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఆటుపోట్లను తట్టుకొని మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతూ గమ్యాలను అందుకుంది.

కష్ట సుఖాల్లో కలిసి నడుస్తూ పల్లెల్లో, గల్లీల్లో గులాబీ పథకాన్ని రెపరెపలాడించి కొండంత అండగా నిలిచిన కార్యకర్తల రుణాన్ని ఎప్పుడు తీర్చుకోలేను.

"""/" / ఇతరులకు రాజకీయాలు అంటే గేమ్స్.బిఆర్ఎస్ కు మాత్రం టాస్క్.

రాజకీయాన్ని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి పవిత్ర కర్తవ్యం గా భావించి, కొత్త పంథాలో నడుస్తూ కోటి కాంతులు విరజిమ్మే నేలగా తెలంగాణను.

తీర్చుదిద్దుకున్నాం.కష్టాలు, కన్నీళ్లు, కరువులతో అల్లాడిన తెలంగాణ ఈ రోజు పచ్చని పంటలతో చిరునవ్వులతో కలకలాడుతుంది.

ఆగమైపోయిన తెలంగాణ నేల కుదిటపడింది.కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోతుంది.

ఒక్కో పథకం ఒక్కో ఆణిముత్యమై దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.'' అంటూ కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ఇంకా అనేక అంశాలపై మాట్లాడిన కేసీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం పెంచడంతో పాటు, రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీ నాయకులను యాక్టివ్ చేసే వ్యూహానికి తెర తీశారు.

బీఆర్ఎస్ ను OLX లో సేల్ పెట్టినా కొనేవాళ్లు లేరు..: ఎంపీ లక్ష్మణ్