కళ్ళ చుట్టూ నల్లటి వలయాలను ఈజీగా వదిలించుకోవడం ఎలాగో తెలుసా?

వయసుతో సంబంధం లేకుండా చాలా మందికి కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు( Dark Circles ) ఏర్పడుతుంటాయి.

కంటి నిండా నిద్ర లేకపోవడం, మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం, ల్యాప్‌టాప్ ముందు గంటలు తరబడి కూర్చుని పని చేయడం, ఒత్తిడి, డిప్రెషన్, మద్యపానం, ధూమపానం, శరీరంలో వేడి ఎక్కువ అవ్వడం తదితర కారణాల వల్ల కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.

ఇవి అందాన్ని తగ్గించి చూపిస్తాయి.అందుకే నల్లటి వలయాలను నివారించుకునేందుకు ముప్పు తిప్ప‌లు పడుతుంటారు.

కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీని కనుక పాటిస్తే చాలా ఈజీగా కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను వదిలించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు,( Flax Seeds ) వన్ టేబుల్ స్పూన్ గ్రీన్ టీ ఆకులు( Green Tea Leaves ) వేసుకోవాలి.

"""/" / అలాగే ఒక అరటిపండు తొక్కను ముక్కలుగా కట్ చేసి వేసుకుని కనీసం 15 నిమిషాల పాటు ఉడికించాలి.

జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్ట్రైనర్ సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.

ఈ జెల్ లో వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్, నాలుగు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ జెల్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.

"""/" / రోజు నైట్ నిద్రించే ముందు ఈ జెల్ ను కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.

ప్రతిరోజు ఈ విధంగా చేస్తే కళ్ళ చుట్టూ నల్లటి వలయాలు కొద్దిరోజుల్లోనే మాయం అవుతాయి.

అలాగే క‌ళ్ల వ‌ద్ద ఏమైనా ముడతలు ఉన్నా సరే మాయం అవుతాయి.ఈ జెల్ ను కళ్ళ చుట్టూ మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి కూడా అప్లై చేసుకోవచ్చు.

ఫేస్ మొత్తానికి అప్లై చేసుకోవడం వల్ల ఉదయానికి చర్మం గ్లోయింగ్ గా షైనీగా మెరుస్తుంది.

వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరకుండా సైతం ఉంటాయి.

నా స్నేహితుడు చిరంజీవితో నటించడం మరిచిపోలేనిది.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్!