సొంత అల్లుడినే చంపేశాడు ఓ వ్యక్తి.తన మనమరాళ్లను చంపుతానని బెదిరించడంతో కత్తితో తల నరికేశాడు.
అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.అన్నవరం జిల్లా రౌతులపూడి మండలం జగన్నాథపురానికి చెందిన సత్యనారాయణ 2015 సంవత్సరంలో శంఖవరం మండలం అచ్చంపేటకు చెందిన లచ్చబాబుతో సత్యనారాయణ తన కూమార్తెను ఇచ్చి పెళ్లి చేశాడు.
ఈ దంపతులకు ఇద్దరు కూతుళ్లు.గతేడాది సత్యనారాయణ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అప్పటినుంచి సత్యనారాయణకు తన అల్లుడే తన కూతురి చంపేశాడని అనుమానం ఉండేది.కుమార్తె మరణించడంతో సత్యనారాయణ తన మనుమరాళ్లను ఇంటికి తీసుకొచ్చాడు.
పండుగ కావడంలో ఆదివారం సత్యనారాయణ తన అల్లుడు లచ్చబాబుకు ఫోన్ చేసి బట్టలు పెట్టాలని, ఇంటికి రమ్మని చెప్పాడు.
ఇంటికి వచ్చిన అల్లుడితో పిల్లలను ఇంటికి తీసుకెళ్లమని అడిగాడు.అప్పుడు లచ్చబాబు నాకు రెండో పెళ్లి చేస్తేనే పిల్లలను తీసుకెళ్తానని చెప్పడంతో వారిద్దరి మధ్య గొడవ నెలకొంది.
పెళ్లి చేయకపోతే పిల్లలిద్దరిని చంపేస్తానని బెదిరించాడు లచ్చబాబు.దీంతో కూతురుని పొగొట్టుకున్న కోపంలో.
పిల్లలిద్దరిని చంపేస్తానని బెదిరించడంతో కోపోధ్రిక్తుడైన సత్యనారాయణ పక్కనే ఉన్న కత్తి తీసుకుని అల్లుడు లచ్చబాబు తల నరికేశాడు.
అక్కడి నుంచి నేరుగా పెద్దాపురం పోలీస్ స్టేషన్ కు వెళ్లి సరెండర్ అయ్యాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రత్తిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు డీఎస్పీ వెల్లడించాడు.
కుక్క ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే.. ఏనుగు ముందు నిలబడి ఏం చేసిందో చూడండి!