ఇకపై మరింత సులువుగా డ్రైవింగ్ లైసెన్స్.. సర్వీసులన్నీ ఆన్లైన్ లోనే..!

సాధారణంగా ఆర్టీఏకు సంబంధించిన ఎటువంటి సేవలను పొందాలన్న రవాణా శాఖ ఆఫీస్ కి వెళ్లి అక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కానీ, ప్రస్తుతం రవాణాశాఖ సంబంధించిన అనేక సేవలను ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకొనివచ్చారు.

కానీ ఆ సేవలు అన్నీ కూడా కొన్ని రాష్ట్రాలలో మాత్రమే ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా మార్చి నెల ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలను ఆన్లైన్ లోనే లభించపోతున్నట్లు సమాచారం.

  తాజాగా అందుకు తగ్గట్టు అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేసింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ.

ఇక ఇప్పటి వరకు మధ్యప్రదేశ్, జార్ఖండ్, హర్యానా ,ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ , బీహార్ లాంటి వివిధ రాష్ట్రాలలో 90 శాతం వరకు అన్ని ఆర్‌టీవో సేవలను ఆన్లైన్ లోనే ప్రజలకు అందజేశారు.

కేవలం వాహన ఫిట్నెస్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ లకు మాత్రమే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది.

కానీ మార్చి నెల నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా ఆర్టీవో సేవలు అన్నీ ఆన్లైన్ లోనే అందజేస్తున్నారు.

దీంతో అన్ని రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే వాహనదారులు తమ డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కానీ, ఫిట్నెస్ టెస్ట్ కోసం మాత్రమే రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లి ఆ టెస్ట్ లను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

మిగితా వివిధ రకాల సేవలు అన్నీ కూడా ఆన్లైన్ లోనే సులువుగా పూర్తి చేసుకోవచ్చు.

ఎవరైనా వాహనదారుడు వారి డ్రైవింగ్ లైసెన్స్ కావాలనుకుంటే రవాణా శాఖ కార్యాలయంలోని అప్లికేషన్ కోసం గంటల వ్యవధిలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ ద్వారా సులువుగా అప్లై చేసుకొని, డ్రైవింగ్ లైసెన్స్ కు సంబంధించిన అన్ని పత్రాలు అన్నిటిని కూడా ఆన్లైన్ ద్వారానే అప్లోడ్ చేసుకోవచ్చు.

ఇలా అప్లోడ్ చేసుకున్న అనంతరం నిర్ణీత తేదీల్లోనే రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి వాహన ఫిట్నెస్, డ్రైవింగ్ లైసెన్స్ టెస్ట్ కి హాజరు అవుతే చాలు.

ఇక సులువుగా డ్రైవింగ్ లైసెన్స్ సొంతం చేసుకోవచ్చు.ఇలా వివిధ సేవలు ఆన్లైన్ ద్వారా అందించడంతో  వాహనదారులకి ఊరట లభిస్తుంది.

మోస్ట్ పాపులర్ హీరోల జాబితాలో టాప్ లో ప్రభాస్.. ఎన్టీఆర్, బన్నీ, మహేష్ స్థానాలివే!