ఏపీ రాజధాని ప్రాంతంలో ప్రకంపించిన భూమి.. భయందోళనలో ప్రజలు.. !

ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుందట.ఇళ్లలోని తలుపులు, కిటకీలు దడదడమని కొట్టుకోవడంతో ప్రజలు భయానికి గురైయ్యారట.

కాగా అమరావతిలో ఈ తెల్లవారు జామున భూ ప్రకంపనలు జనాలను బెంబేలెత్తించి, ఆందోళనకు గురిచేసాయట.

దాంతో అప్పటి వరకు నిద్ర మత్తులో ఉన్న ప్రజలు భూ ప్రకంపనలతో ఒక్క సారిగా ఏం జరుగుతుందో తెలియక ఉలిక్కి పడ్డారు.

వడివడిగా ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీసి చాలా సేపటి వరకు ఇళ్ల బయటే ఉండిపోయారట.

ఈరోజు తెల్లవారు జామున సుమారుగా5.10 గంటల సమయంలో పలు గ్రామాల్లో ప్రకంపనలు వచ్చాయని అధికారులు వెల్లడించారు.

కాగా ఈ సమాచారం అందుకున్న అధికారులు ఆయా గ్రామాలకు చేరుకుని, ప్రకంపనలకు గల కారణాలను విశ్లేషిస్తున్నారట.

ఇకపోతే తాడికొండ, తుళ్లూరు, రాయపూడి, నెక్కల్లు, బడెపురం, కార్లపూడి ప్రాంతాలలో ఒక్కసారిగా వింత శబ్దాలతో భూమి కంపించినట్లు తెలుస్తుంది.

కాగా భూప్రకంపనలు ఎక్కడ నుంచి వచ్చాయి.? ప్రకంపనాలకు వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా? అనే విషయాలపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారట.

రూ. 5 కోసం కక్కుర్తి.. రూ. లక్ష బొక్క పెట్టించుకున్న క్యాటరింగ్ కంపెనీ (వీడియో)