నెల్లూరు జిల్లాలో భూ కంపం.. భ‌యాంధోళ‌నలో ప్రజలు.. !

ఈ ప్రపంచాన్నే శాసించే స్దాయికి మనిషి ఎదిగినా ప్రకృతి ముందు నిత్యం ఓటమినే చూస్తున్నాడు.

ప్రకృతి వైపరిత్యాలను ఎదుర్కొనలేక చతికిల పడుతున్నాడు.సృష్టికి ప్రతిసృష్టి చేస్తున్నానని విర్రవీగుతున్నాడు గానీ తన పతనానికి తానే గోతులు తీసుకుంటున్న విషయాన్ని విస్మరిస్తున్నాడు.

ఈ ప్రకృతి నుండి ఏర్పడే ఎలాంటి విపత్తుకైన గడగడలాడ వలసిందే.ఏడంతస్తుల మేడల్లో ఉన్నా ఒక్క సారిగా నేలమీద పడి మట్టిలో కలిసిపోవలసిందే.

ఇంతటి దానికి అంతులేని ఆశతో నిత్యం సావాసం చేస్తున్నాడు మానవుడు.ఇకపోతే భూకంపం అనగానే ఒంట్లో భయం పుడుతుంది.

దీని వల్ల కలిగే నష్టం మాటలకు కూడ అందదు.కానీ మనదేశంలో పెద్ద ప్రమాదాన్ని కలిగించే భూకంపాలు చాలా అంటే చాలా తక్కువగా సంభవిస్తాయని చెప్పవచ్చూ.

ఇకపోతే నెల్లూరు జిల్లా వ‌రికుంట‌పాడులో స్వలంగా భూమి కంపించ‌డం తో ప్ర‌జ‌లు భ‌యాంధోళ‌న‌ల‌కు గురైయ్యారు.

దీని వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ న‌ష్టం సంభవించలేదు.కాగా అధికారులు భూమి కంపించ‌డానికి గల కార‌ణాల‌ను పరిశీలిస్తున్నారట.

స‌మ్మ‌ర్ ఫ్రూట్ మ్యాంగోతో బెస్ట్ వెయిస్ లాస్ స్మూతీ మీకోసం..!