ఏపీలో ముందుగానే ఎన్నికలు ! క్లారిటీ ఇచ్చేసిన జగన్
TeluguStop.com
ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయనే హడావుడి చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. అయితే ముందస్తు ఎన్నికల కు వెళ్లే ఆలోచన తమకు లేదని , సాధారణ ఎన్నికలే జరుగుతాయని వైసీపీ కీలక నాయకులు సందర్భం వచ్చినప్పుడల్లా చెబుతూనే వస్తున్నారు.
అయితే వైసిపి అధినేత , ఏపీ సీఎం జగన్ ( AP CM Jagan )మాత్రం ముందస్తు ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేందుకు తాము సిద్ధమే అని చెబుతూనే ఎన్నికల ప్రచార తంతు మొదలుపెట్టేశారు.
పార్టీ శ్రేణులు అంతా జనాల్లో ఉండే విధంగా అనేక కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సర్వే నివేదికలు తెప్పించుకుని బలహీనంగా ఉన్న నియోజకవర్గాల్లో కొత్తగా ఇన్చార్జీలను నియమిస్తున్నారు.
"""/" /
మంత్రులు, ఎంపీలు ఇలా ఎవరైనా సర్వేల్లో గెలిచే అవకాశం లేదని తేలితే పక్కకు తప్పించాలని జగన్ నిర్ణయించుకున్నారు.
కొత్త ఇన్చార్జిల నియామకం కూడా చేపట్టారు. తాజాగా ఈరోజు జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఏపీ ఎన్నికలపై జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో అనుకున్న దానికంటే కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం ఉందని, అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని మంత్రులతో జగన్ వ్యాఖ్యానించారు.
'' ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం .అయినా సరే మంత్రులు క్షేత్రస్థాయిలో మరింత సమర్థవంతంగా పనిచేయాలి.
గతంలో కంటే 20 రోజులు ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చు'' అంటూ జగన్( AP CM Jagan ) వ్యాఖ్యానించారు .
"""/" /
ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలతో పాటు, టిడిపి ( TDP )అనుకూల మీడియా గా చెబుతున్న కొన్ని ఛానెళ్లు, పత్రికలపై జగన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
ప్రతిపక్షాలు , టిడిపి అనుకూల మీడియా చేసే విష ప్రచారాలను తేలిగ్గా తీసుకోవద్దని, వారు చేసే అసత్య ప్రచారాలను ఎప్పటికప్పుడు తిప్పు కొట్టి ప్రజలకు వాస్తవ పరిస్థితులను వివరించాలని క్యాబినెట్ సమావేశం లో మంత్రులకు జగన్ సూచించారు.
ఆ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తే బాగుంటుంది.. బాలకృష్ణ కామెంట్స్ వైరల్!