కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ లో ముందస్తు బతుకమ్మ ఉత్సవాలు!
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో( Krishnaveni Talent School ) గురువారం అట్టహసంగా ముందస్తు కృష్ణవేణీ బతుకమ్మ ఉత్సవాలను విద్యాసంస్థల కరస్పాండెంట్ సన్నిధి వెంకట కృష్ణ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఆనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పిన పండుగ బతుకమ్మ అని గుర్తుచేస్తూ ప్రతి ఒక్కరు సంస్కృతి సాంప్రదాయాన్ని క్రమం తప్పకుండా పాటించాలని, ఉత్తమంగా వ్యవహరించాలని, బొడ్డమ్మ ఆరంభం నాటి నుండి మహా అష్టమి వరకు బతుకమ్మ ఆటను ఆకాశమే హద్దుగా అన్నట్టు వివిధ రకాల జానపద గేయాలు, ప్రకృతి పులకరించే పాటలతో చూడచ క్కగా వేడుకలను జరుపుకుంటారని, ఊరూ వాడా తేడా లేదనుకుండ రెట్టింపు ఉత్సాహంతో పండు గను వైభవోపేతంగా నిర్వహించుకుంటారని అని అన్నారు.
సమజాంలో ఐక్యత, ప్రేమ అనురాగాన్ని ఆవిష్కరించే పండుగ ఇదేనని తెలుపుతూ ప్రకృతి ఒడిలో దొరికేటువంటి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించి గౌరీమాత కృపను పొందుతారన్నారు.
బతకమ్మకు అత్యంత ప్రీతికరమైనటు వంటి గౌరీమాతను గుమ్మడి పూలతో తయారు చేసి ఆ అమ్మవారి కృపను వారి పరివారానికి నిలుపు కుంటారని తెలియజేస్తూ బతుకమ్మ పండుగ ద్వారా ప్రేమ అనురాగం చాలా వెల్లివిరిస్తూందని వారు చెప్పారు.
ఎనిమిది రోజుల బతుకమ్మ వివిధ రకాల ప్రసాదాలతో ఆరాధించి అమ్మ వారి ఆశీస్సులను అధికంగా ఉండేలా చేస్తారని, ప్రత్యేకంగా అమ్మవారి శరనవరాత్ప్రవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలతో కఠినంగా ఉపవాసాలను పాఠించి పూజా కైంకర్యాలను నిర్వహిస్తారని, అమ్మవా రిని పది రోజులలో పది అవతారాలలో సుందరంగా అలంకరించి అమ్మవారిని సపరివారంగా సుహా సినిలందరు సుందరంగా ప్రతిష్ఠాపనకు, ఆశిర్వచనానికి అట్టహాసంగా శ్రీలలిస సహస్ర నామ పారాయణ ద్వారా ఆహ్వానించి పూజా కార్యక్రమాలను చాలా గొప్పగా నిర్వహించారు.
సుమారు 200 మంది విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి పాఠశాలలో పండుగ వాతావ ర్ణాన్ని రెట్టింపు చేశారు.
అదే విధంగా సుమారు 150 పైగా బతుకమ్మలను విద్యార్థులు వివిధ రూపాల్లో తయారుచేసి వారి ఆనందాన్ని కొలాట ద్వారా ప్రదర్శించారు.
ఈ కార్యక్రమంలో పాఠ శాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు సినిమాలను చూస్తూ డైరెక్షన్ నేర్చుకుంటున్న బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు…