హుజూర్ నగర్ కేటీఆర్ రోడ్ షో సందర్భంగా ముందస్తు అరెస్టులు…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: హుజూర్ నగర్( Huzur Nagar ) పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్ధి శానంపూడి సైదిరెడ్డి ( Sanampudi Saidireddy )విజయాన్ని కాంక్షిస్తూ నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటిఆర్ రోడ్ షో చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో హుజూర్ నగర్,నేరేడుచర్ల పట్టణాల్లో వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
ఈ సందర్భంగా అరెస్ట్ అయిన నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తే పోలీసులు ముందస్తుగా మమ్మల్ని అరెస్టు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.కేటీఆర్ రోడ్ షో( KTR Road Show ) లో ప్రజా సమస్యలపై ఎక్కడ గళం విప్పుతామనే భయంతోనే పోలీసులు అత్యుత్సాహంతో ముందస్తుగా అక్రమ అరెస్టు చేశారని మండిపడ్డారు.
ఎన్ని అరెస్టులు చేసినా తాము నిరంతరం ప్రజల కోసమే పని చేస్తామని అన్నారు.
ప్రజల్లో చైతన్యం వచ్చిందని,అక్రమ అరెస్టులతో ఇక బీఆర్ఎస్ పతనాన్ని ఎవరు ఆపలేరని హెచ్చరించారు.
క్యూట్ వీడియో.. స్టేజీపై నుంచే స్నేహితురాలికి ప్రపోజ్ చేసిన సినిమా డైరక్టర్.. చివరకు?