బీసీ సంఘం నేత ముందస్తు అరెస్ట్

యాదాద్రి భువనగిరి జిల్లా:బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం బీసీల డిమాండ్ల కోసం చలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు కొత్త నరసింహస్వామి పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెల్లవారు జామునే తమ నివాసము వద్దకు చేరుకున్న పోలీసులు తనను అక్రమంగా అరెస్ట్ చేశారని అయన అవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో హక్కుల కోసం గళమెత్తే పరిస్థితి లేదని,నిరసన వ్యక్తం చేస్తే హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు.

ప్రజా ఉద్యమాలు చేసే వారిని ముందస్తు అరెస్టులు చేయడం ఏమిటని ప్రశ్నించారు.

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న స్టార్ హీరో…