మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా:భట్టి,సీతక్క

నల్లగొండ జిల్లా:మునుగోడు ఉప ఎన్నిక అన్ని పార్టీలకి భవిష్యత్ ఎన్నికలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

మునుగోడు మండల కేంద్రంలోని పీఆర్ఆర్ ఫంక్షన్ హల్ లో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశానికి ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో కాంగ్రెస్ చాలా బలంగా ఉందన్నారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి మునుగోడు గడ్డ కాంగ్రెస్ అడ్డా అని నిరూపిస్తుందని ధీమా వ్యక్తం చేసారు.

అధికార అహంకారంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మీడియా సంస్థలను గుప్పిట్లో పెట్టుకొని,భయపెట్టి,ప్రలోభపెట్టి అనుకూలంగా వార్తలు రాపిస్తున్నారని ఆరోపించారు.

ఎవరు ఎన్ని చేసినా కాంగ్రెస్ సిద్ధాంత భావజాలమే గెలిపిస్తుందన్నారు.గత ఎనిమిదేళ్లుగా కేంద్ర బీజేపీ, రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభ్యత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయి,పెరుగుతున్న నిత్యవసర వస్తువుల, డీజిల్,పెట్రోల్,గ్యాస్ ధరలు తగ్గాలంటే బీజేపీని ఓడించి,కాంగ్రెస్ ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

దేశ సంపదను అమ్ముతూ,ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ,నియంతృత్వ పోకడలతో దేశాన్ని ఏలుతున్న బీజేపీని మునుగోడులో ఓడించి ప్రజావ్యతిరేక పాలన ఇక చాలన్న సందేశాన్ని మునుగోడు దేశానికి ఇవ్వాలన్నారు.

ధరల పెరుగుదలతో దేశ ప్రజలు ఆందోళన చెందుతున్నారే తప్పా ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు.

కానీ,మునుగోడు ప్రజలకు బ్రహ్మాస్త్రంగా ఉన్న ఓటుతో వారికి బుద్ధి చెప్పాలన్నారు.8 ఏళ్లుగా తెలంగాణ సంపదను టిఆర్ఎస్ పాలకులు దోపిడీ చేయడమే కాకుండా ఐదు లక్షల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాళ తీయించారని ఏద్దేవా చేశారు.

అనంతరం ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ మిషన్ భగీరథ, చెరువుల పూడిక తీత పేరిట రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు.

ప్రతి పౌరుడుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తలసరి అప్పు 2.25 లక్షలు భారం మోపి,అప్పులు చేసి తెలంగాణను దివాలా తీయించడానికేనా? కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందని ప్రశ్నించారు.

ఎస్సెల్బీసీ టన్నెల్ సొరంగం పనులు పూర్తి చేయకుండా మునుగోడు ప్రాంతానికి నీళ్ళు రాకుండా అడ్డుకుంది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధ్వజమెత్తరు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసి కృష్ణానదిలో ఉన్న నీళ్లను పొలాల్లోకి గలగల పారించే వాళ్ళమన్నారు.

కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయం కోసం కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల వలె పని చేయాలని పిలుపునిచ్చారు.

బీజేపీ,టిఆర్ఎస్ లకు వ్యతిరేకంగా ఓటు వేస్తేనే ప్రజాసమస్యల పరిష్కారం దొరుకుతుందన్నారు.మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవకాశం ఉందన్నారు.

రాష్ట్ర,జాతీయ రాజకీయాలకు మునుగోడు ఎన్నిక దిక్సూచి కావాలని,మద్యం ఇతర ప్రలోభాలకు ఓటును వృధా చేయొద్దని,ప్రజా సంక్షేమ రాజ్యానికే మీ ఓటును బ్రహ్మాస్త్రంగా ఉపయోగించాలని కోరారు.

వైట్ అండ్ స్పాట్ లెస్ స్కిన్ ను పొందాలనుకుంటున్నారా.. అయితే ఈ రెమెడీని ట్రై చేయండి!