మునుగోడు అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..!

మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి బీజేపీ అభ్య‌ర్థి గెలుపుతోనే సాధ్య‌మ‌ని కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ తో భేటీ అయిన రాజ‌గోపాల్ రెడ్డి.ఈనెల 21న మునుగోడులో జ‌రిగే అమిత్ షా స‌భ ఏర్పాట్ల‌పై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు.

ఉపఎన్నిక కోసం ప్ర‌జ‌లు కూడా ఎదురు చూస్తున్నార‌న్నారు.గ‌తంలో మునుగోడు స‌మ‌స్య‌ల‌పై ఎన్నిసార్లు ప్ర‌భుత్వానికి మొర‌పెట్టుకున్న ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతోనే రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌ని తెలిపారు.