మునుగోడులో కాంగ్రెస్ షాక్

నల్లగొండ జిల్లా:మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకీ భారీ షాక్ తగిలింది.నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం మండలం గుడిమొల్కాపూర్ కు చెందిన యంపిటిసి శివరాత్రి కవితా విద్యాసాగర్, మునుగోడు మండలం పులిపలుపుల యంపిటిసి బోలుగురి లింగయ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి గులాబీ గూటికి చేరారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ సభ ఏర్పాట్లు నిమిత్తం ఆదివారం సాయంత్రం మునుగోడు నియోజకవర్గ పరిధిలోని నారాయణపురం చేరుకున్న రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి సమక్షంలో తాము టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారు వేరువేరుగా ప్రకటించారు.

కాగా పార్టీలో చేరిన కవితా విద్యాసాగర్ కు మంత్రి జగదీష్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి,యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,తుంగతుర్తి శాసనసభ్యులు గాధరి కిశోర్ కుమార్,మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ హెయిర్ ప్యాక్ తో మీ జుట్టు రాలడం కాదు డబుల్ అవుతుంది..!