గోయింగ్ విత్ ట్రెండ్.. బ్రావో శ్రీవల్లి స్టెప్ చూశారా..!

ప్రస్తుతం వరల్డ్ మొత్తం పుష్ప మేనియాలో ఉందని అంటే ఖచ్చితంగా నమ్మాల్సిందే.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా నేషనల్ వైడ్ గా సూపర్ సెన్సేషనల్ హిట్ కాగా ఈ సినిమాలో శ్రీవల్లి స్టెప్పు.

తగ్గేదేలే మేనిరిజం ట్రెండింగ్ లో ఉన్నాయి.క్రికెటర్లు శ్రీవల్లి స్టెప్పు వేస్తూ ఇప్పటికే చాలా మంది వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక లేటెస్ట్ గా ట్రెండ్ తో వెళ్తున్నా అంటూ వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ బ్రావో కూడా శ్రీవల్లి స్టెప్పు వేసి సర్ప్రైజ్ చేశాడు.

పుష్ప వేసినట్టుగానే శ్రీవల్లి స్టెప్పుని ట్రై చేశాడు.ఓ తెలుగు సినిమా ప్రభావం ఇంటర్నేషనల్ క్రికేటర్స్ ని కూడా కదిలించింది అంటే ఇది మాములు విషయం కాదు.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పేరు ప్రపంచం మొత్తం వినిపించేస్తుంది.పుష్ప పార్ట్ 1 ది రైజ్ కమర్షియల్ గా సక్సెస్ అవడమే కాదు ఈ ట్రెండింగ్ తో పార్ట్ 2 ది రూల్ పై ముందుగానే సూపర్ బజ్ ఏర్పడేలా చేస్తుంది.

మనం చేయాల్సిన కష్టం మనం చేస్తే నేచర్ మనకు కొంత హెల్ప్ చేస్తుంది అంటే ఇదే కావొచ్చు.

పుష్ప సినిమా మీద సుకుమార్, అల్లు అర్జున్ ప్రాణం పెట్టగా సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా శ్రీవల్లి స్టెప్పు, పుష్ప రాజ్ మేనరిజం ఇలా ఒక్కొక్కటిగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి.

వీడియో: ఇన్‌స్టా రీల్స్‌ విషయంలో గొడవ.. రోడ్డు మీద కొట్టుకున్న యువతులు..