మళ్లీ మూతపడనున్న ద్వారకా తిరుమల కారణం అదే!?
TeluguStop.com

కరోనా వైరస్ కారణంగా మనుషులకు మనుషుల దూరం పెరగటమే కాదు ఆ దేవుడికి మనుషులకు కూడా చాలా దూరం అయిపోయాడు.


ఈ మహమ్మారి వైరస్ ప్రభావం ఏకంగా ఆలయాల పై కూడా పడింది.దీంతో ఈ మహమ్మారి వైరస్ నియంత్రించేందుకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ కారణంగా.


దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు మసీదులు చర్చిలు మూతబడ్డాయి.ఈ నేపథ్యంలో దేశ ప్రజానీకం కాస్త ఆందోళన చెందింది అని చెప్పాలి.
ఇటీవలే లాక్ డౌన్ సడలింపు లో భాగంగా ఇప్పుడిప్పుడే ఆలయాలన్ని తెరుచుకున్నాయి.
కొన్ని ఆలయాలు ఇప్పటికి కూడా తెరుచుకోవడం లేదు.తిరుపతి ఆలయం లో ఇప్పుడిప్పుడే భక్తులను అనుమతిస్తున్నారు నిర్వాహకులు.
అటు చిన్న తిరుపతి గా పిలుచుకునే ద్వారకాతిరుమల లో కూడా భక్తులను అనుమతిస్తున్నారు నిర్వాహకులు.
అయితే జూన్ 21వ తేదీన మరోసారి ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
కారణం సూర్యగ్రహణం.జూన్ 21వ తేదీన సూర్య గ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తెలిపారు.
20వ తేదీ రాత్రి యధావిధిగా ఆలయం మూసివేత 21 తేదీన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆలయం తెరిచి.
శుద్ధి చేస్తామని తెలిపారు.ఇక 21 తేదీన రాత్రి ఏడు గంటల నుండి భక్తుల దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.
జువెలరీ షోరూం ప్రారంభోత్సవంలో సందడి చేసిన సితార … ఫోటోలు వైరల్!