టిడిపి అధ్యక్షుడు పై గురి పెట్టిన వైసిపి?
TeluguStop.com
టిడిపి అధికారంలో ఉండగా జగన్ ను వ్యక్తిగతం గా విమర్శలు చేసి ఇబ్బంది పెట్టిన నేతల్లో ముందు వరుసలో ఉండే నేతగా అచ్చం నాయుడు పేరు చెబుతారు.
దూకుడైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రసు గా ఉండే అచ్చం నాయుడు ని జగన్ని వ్యక్తిగతంగా కూడా అసెంబ్లీలో విమర్శలు చేశారు అందువల్లే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పై అనేక కేసులుపెట్టి జైలుకు కూడా పంపించారు .
వచ్చే ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని జగన్ చూస్తున్న నేతల్లో కూడా అచ్చం నాయుడు( Kinjarapu Atchannaidu ) పేరు ముందు వరుసలో ఉందని చెప్తారు .
నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న కింజరపు కుటుంబం వరుస విజయాలతో దూసుకుపోతుంది.
ఎర్ర నాయుడు తర్వాత ఆయన హవాను కొనసాగిస్తూ ఆయన కుమారుడు రామ్మోహన్ ఎంపీగా గెలుస్తూ వస్తుంటే తమ్ముడు అచ్చం నాయుడు టెక్కలి నుంచి వరుసగా విజయం సాధిస్తూ వస్తున్నారు.
"""/" / ఇప్పుడు ఆయనపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస సతీమణి దువ్వాడ వాణి ని ప్రయోగించాలని వైసీపీ భావిస్తున్నదట .
టెక్కలి లో వరుసగా గెలుస్తూ వస్తున్న అచ్చెన్న పై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని దానిని క్యాష్ చేసుకోవాలని అదికార పార్టీ బావిస్తుంది .
అంతేకాకుండా దువ్వాడ వాణి( Duvvada ) కి ఒకసారి అచ్చం నాయుడు పై పోటీ చేసిన అనుభవం కూడా ఉందట .
అచ్చం నాయుడు టెక్కలి నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని అబివృద్ది చేస్తానని అప్పుడే నియోజకవర్గం అంతా తిరుగుతున్నారట .
మహిళా అనే కార్డుతో పాటు కాలింగ సామాజిక వర్గానికి చెందిన నేతగా ఆమెకు బలమైన మద్దతు కూడా ఉన్నదట .
"""/" /
ఆ నియోజకవర్గం పై ఎప్పటినుంచో కాలింగలకు పట్టు ఉన్నప్పటికీని వెలమ సామాజిక వర్గానికి చెందిన అచ్చం నాయుడు గత రెండుసార్లుగా గెలవడంతో ఈసారి ఎలాగైనా ఆ నియోజకవర్గాన్ని గెలిపించుకోవాలని ఆ సామాజిక వర్గం భావిస్తున్నదని అందుకే మహిళా ఓట్లతో పాటు ఆ సామాజిక వర్గ ఓట్లు కూడా ఆకర్షించగలిగితే టెక్కలి లో వాణి గెలుపు తద్యమే అనే వైసీపీ అధిష్టానం భావిస్తుందని తెలుస్తుంది.
అందుకే ఈ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న వైసీపీ( YCP ) అన్ని రకాల అస్తాలను ప్రయోగించడానికి సిద్ధమైందట.
మరి ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిని ఓడిస్తే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కూడా ఉంటుందని వైకాపా బావిస్తున్నట్లుగా తెలుస్తుంది
.
నాన్ వెజ్ వారానికి ఎన్నిసార్లు తినొచ్చు.. రెగ్యులర్ గా తింటే ఏం అవుతుంది?