ఇంద్రకీలాద్రి లో ఏడవ రోజుకి చేరుకున్న దసరా శరన్నవరాత్రి వేడుకలు..
TeluguStop.com
ఏడో రోజు లలితా త్రిపుర సుందరీ దేవి( Lalitha Tripura Sundari Devi )గా దర్శనమిస్తున్నటువంటి అమ్మవారు.
ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం.
అమ్మవారి అలంకారాలలో లలితా త్రిపుర సుందరీ దేవి కి ప్రత్యేకత ఉంది.
త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఉన్నది కాబట్టి త్రిపురసుందరి అని పిలవబడుతోంది.శ్రీదేవి యే శ్రీ చక్ర అధిష్టాన శక్తి గా పంచదశాక్షరీ మహా మంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తుల్ని ఉపాసకుల్ని అనుగ్రహిస్తోంది.
లక్ష్మీ దేవి , సరస్వతిదేవి( Lakshmi Devi ) ఇరువైపులా వింజామరలతో సేవిస్తుండగా చిరుమందహాసంతో భక్తిపావనాన్ని చిందే చెరుకుగడను చేతబట్టుకుని శివుని వృక్ష స్థలం పై కూర్చుని దేవి దర్శనమిస్తుంది.
దర్శన సమయంలో పరమేశ్వరుడు త్రిపురేశ్వరుడిగా , అమ్మవారు త్రిపురసందరీదేవిగా భక్తుల చేత పూజలందుకుంటారు.