సూర్యాపేట జిల్లా:ఏ దిక్కూలేని వారికి ప్రభుత్వమే పెద్ద దిక్కుగా మారి ఆసరా పథకం పేరుతో వివిధ రకాలుగా వృద్ధులకు,వితంతువులకు, వికలాంగులకు,గీత,నేత,బీడీ కార్మికులకు కొంత ఆసరాగా ఉంటుందని ఆసరా పథకం నుండి
నెలకు కేవలం రెండు నుండి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంది.
చాలామంది పేదలు నెలసరి వచ్చే పెన్షన్ కోసం ఎదురుచూపులు చూస్తారు.ఆసరా పథకం కింద ఇస్తున్న పెన్షన్స్ నెలనెలా సక్రమంగా అందివ్వకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం కూడా తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇక ఆసరా పెన్షన్స్ ఇచ్చే పోస్ట్ మాస్టర్ ల దోపిడీ మరో విధంగా ఉంది.
అసలే చాలిచాలని పెన్షన్ అందులోనే పైనే వచ్చే రూ.16 కట్ చేస్తారు.
ఇక దసరా పండుగ పేరుతో గత నాలుగేళ్లుగా ఒక్కో పెన్షన్ లబ్ధిదారుల నుండి రూ.
50 లు,నూతనంగా మంజూరైన పెన్షన్ నుండి రూ.100లు మామూళ్లు వసూల్ చేస్తున్న దుర్మార్గమైన దోపిడీ సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలోని బేతవోలు గ్రామంలో
ఆలస్యంగా వెలుగుచూసింది.
వృద్ధాప్య పింఛన్ ఇచ్చే పోస్టాఫీస్ లో జరుగుతున్న ఈ వ్యవహారంపై స్థానికులు ప్రశ్నిస్తే పోస్ట్ మాస్టర్ మరియు స్థానికంగా ఉండే ఓ అధికారి బెదిరింపులకు పాల్పడడం, ప్రశ్నించిన వారి గురించి లోకల్ వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా అతని నోరు మూపించే పనికి పూనుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ దుర్మార్గం ఒక వృద్ధురాలి వీడియోతో వెలుగులోకొచ్చి,సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
గత నాలుగు సంవత్సరాలుగా గ్రామంలో ఇదే తంతు కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడం,గ్రామ పాలక మండలి కూడా చూసి చూడనట్లు వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
బేతవోలు గ్రామంలో 1200 మందికి పెన్షన్స్ వస్తున్నాయి.ఒక్కొక్క పెన్షన్స్ రూ.
2016 లేదా రూ.3016 కానీ,పైన ఉన్న రూ.
16 ఇచ్చిన పాపాన పోలేదని,రూ.2000 లేదా రూ.
3000 మాత్రమే ఇస్తారని తెలుస్తోంది.ఇదే గ్రామంలో కొత్తగా మరో 350 పెన్షన్స్ మంజూరైనవి.
వీటికి గాను దసరా మామూళ్ల పేరుతో రూ.100,200 వరకు,ప్రతి ఏడూ ఇచ్చే పాతవారికి రూ.
50,ఇవి కాక ప్రతి నెలా పైనవచ్చే చిల్లర రూ.16 ఎలాగూ ఇవ్వరు.
అంటే మొత్తం 1550 పెన్షన్స్లో 1200 పాతవి,350 కొత్తవి,పాత పెన్షన్స్ నుండి రూ.
60,000,కొత్త పెన్షన్స్ నుండి 35000,15 వందల మంది నుండి రూ.16 కటింగ్ పైసలు రూ.
24,000 మొత్తం దసరా మామూళ్ల పేరు మీద ఆ పోస్ట్ మ్యాన్ ఆసరా పెన్షర్ల దగ్గర ఒక లక్షా 19 వేల రూపాయలను లాగేసుకుంటుంటే కనీసం అడిగేవారు లేకపోవడం బాధాకరం.
బాధిత పెన్షన్ దారుల నుండి అతనే కట్ చేసుకొని మిగతా అమౌంట్ ఇస్తున్నాడని ఓ బాధిత వృద్ధురాలు చెప్పడం చూస్తుంటే సమాజాన్ని చూసి సిగ్గుపడాలని అనిపిస్తుంది.
ఇందులో బేతవోలు
పోస్ట్ మాస్టర్ తో పాటు,హుజూర్ నగర్ కి చెందిన ఒక ఆఫీసర్ పాత్ర కూడా ఉందని సమాచారం.
ఈ వృద్ధులు,వితంతువులు,వికలాంగుల దగ్గర ఇంత బహిరంగ దోపిడీకి పాల్పడుతున్న పోస్ట్ మాస్టర్ అతనికి సహాకరించే హుజూర్ నగర్ ఆఫీసర్ పై శాఖపరమైన చర్యలు తీసుకొని,బాధిత పెన్షర్లకు డబ్బు తిరిగి ఇప్పించాలని స్థానికులు కోరుతున్నారు.
దుబాయ్‌లో దారుణం .. ఇద్దరు తెలుగువారిని నరికి చంపిన పాకిస్తానీ