ఈ సీజన్‌లో కళ్లకు ఇన్ఫెక్షన్ రాకుండా ఇలా జాగ్రత్తలు తీసుకోండి!
TeluguStop.com
మాన్‌సూన్ సీజన్, వాతావరణం చల్లగా, ఆహ్లాదబారితంగా ఉన్నా, ఈ సీజన్‌లోనే బ్యాక్టిరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది.
ఎందుకంటే వాతావరణంలో తేమ శాతం పెరుగుతుంది.అందుకే ఈ కాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇండస్ హెల్త్ ప్లస్ స్పెషలిస్ట్, ఎండీ కంచన్ నైకవాడి దీనిపై కొన్ని జాగ్రత్తలు సూచించారు.
ఆ వివరాలు తెలుసుకుందాం.కరోనా నేపథ్యంలో నోరు, ముక్కు, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం నేర్చుకున్నాం.
కానీ, చాలా మందికి కళ్లకు ఎలాంటి జాగ్రత్తా చర్యలు తీసుకోవాలో తెలీదు.దీనికి నైకవాడి కొన్ని జాగ్రత్తలు తెలిపారు.
H3 Class=subheader-styleపరిశుభ్రత./h3p
ఎల్లప్పుడూ ఫేస్ టవల్స్, న్యాప్‌కీన్స్, కర్చీఫ్స్ వాడాలి.
ఒకరు వాడిన టవల్స్, కళ్లజోడు, లెన్సెస్ మరొకరు వాడకుండా జాగ్రత్త వహించాలి.బయటికి వెళితే సన్‌గ్లాస్ లేదా స్పెక్టకల్స్ వాడటం మరిచిపోకూడదు.
దీంతో వైరస్ లేదా బ్యాక్టిరియాల బారిన పడకుండా ఉండవచ్చు.కళ్లను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
చల్లటి నీటితో ప్రతిరోజూ కడుక్కోవాలి.కళ్లను హార్ష్‌గా కాకుండా సున్నితంగా కడగాలి.
కాంటాక్ట్ లెన్స్ తీసివేసి వాష్ చాయాలి.లేకపోతే దీనివల్ల మీ కార్నియా శాశ్వతంగా గాయపడే ప్రమాదం ఉంది.
"""/"/
సాధ్యమైనంత వరకు కాంటాక్ట్ లెన్స్ వాడకపోవడమే మేలు.ఎందుకంటే ఇవి కళ్లను పొడిబారినట్టు చేసి, కళ్లు ఎర్రగా మారి దురద పేడుతుంది.
కళ్ల జోడు శుభ్రంగా, పొడిగా ఉండేలా చూసుకోవాలి.తడి ఉండే ప్రదేశంలో ఎక్కువ సమయం ఉండ కూడదు.
ఆ ప్రాంతంలో వైరస్, బ్యాక్టిరియాలు ఎక్కువ ఉంటాయి.దీంతో కంటికి ఫంగస్ సులభంగా సోకుతుంది.
ఇది ప్రమాదానికి దారితీస్తుంది.ఆరోగ్యకరమైన భోజనం తీసుకోవాలి.
దీంతో ఇమ్యూనిటీ లెవల్ పెరుగుతుంది.తద్వారా ఇన్ఫెక్షన్లతో సులభంగా పోరాడే శక్తి వస్తుంది.
సాధారణంగా వర్షాకాలంలోనే ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.దీనికి భయపడాల్సిన అవసరం లేకున్నా, కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, ప్రమాదం నుంచి బయటపడవచ్చు.
"""/"/
H3 Class=subheader-styleఐ ఫ్లూ./h3p
దీని వల్ల కళ్లు దురదగా ఉంటాయి.
ఇది ఇతరులకు కూడా సులభంగా సోకుతుంది.రెండు మూడు రోజుల్లోనే ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.
H3 Class=subheader-styleస్టై./h3p
ఇది ఐలిడ్‌లో కొంత ఎరుపు రంగులోకి మారుతుంది.
ఇది కూడా కొన్ని రోజుల్లోనే మాయమవుతుంది.ఇది కన్ను నొప్పిగా, కాస్త చిరగ్గా అనిపిస్తుంది.
మధ్యప్రదేశ్‌లో దాహం వేసిన చిరుతపులులకు నీళ్లు ఇచ్చిన డ్రైవర్.. ఉద్యోగం నుంచి సస్పెన్షన్!