న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గాపూజ.. భారీగా తరలివచ్చిన భారతీయులు

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయులు( Indians ) మన సంస్కృతిని అక్కడికి వ్యాపింపజేస్తున్నారు.

భారతీయ పండుగులు మన దగ్గర జరిగినప్పుడే విదేశాల్లోనూ ఒకేసారి నిర్వహిస్తున్నారు.ప్రస్తుతం భారతదేశంలో శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే.

దీంతో ఎన్ఆర్ఐలు స్థిరపడిన దేశాల్లోనూ నవరాత్రి పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్‌లో వందలాది మంది భారతీయులు దుర్గాపూజ కార్యక్రమంలో( Durga Puja ) పాల్గొన్నారు.

రద్దీగా ఉండే ఈ ఐకానిక్ ప్లేస్‌లో ప్రజల మధ్య దుర్గాపూజ నిర్వహిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దీనిని వీక్షించేందుకు అన్ని వర్గాల ప్రజలు టైమ్స్ స్క్వేర్ వద్దకు చేరుకున్నారు. """/" / ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్సర్ రుచికా జైన్( Ruchika Jain ).

పండుగ ప్రారంభాన్ని తెలియజేస్తూ ఓ వీడియోను పంచుకున్నారు.భారతీయ అమెరికన్‌లను ఈ ఉత్సవాల్లో చేరాల్సిందిగా ఆమె పిలుపునిచ్చారు.

బెంగాలీ క్లబ్ యూఎస్ఏ ( Bengali Club USA )నిర్వహించిన ఈ కార్యక్రమం శరన్నవరాత్రుల్లో 9వ రోజుకు గుర్తుగా సాంప్రదాయ నవమి పూజ, దుర్గా స్తోత్రాలతో ప్రారంభమైంది.

పెళ్లయిన స్త్రీలు పూసుకునే బెంగాలీ సంప్రదాయమైన సిందూర్ ఖేలా కూడా టైమ్ స్క్వేర్‌లో జరిగింది.

కార్యక్రమం ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన బాలీవుడ్ డ్యాన్స్ మ్యూజికల్ ఈవెంట్ ఆహుతులను ఆకట్టుకుంది.

"""/" / టైమ్స్ స్క్వేర్‌లో దుర్గాపూజకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు.

న్యూయార్క్‌లో ఐకానిక్ ప్లేస్‌లో ఈ వేడుక తొలిసారిగా జరుగుతోందని ఓ యూజర్ కామెంట్ చేశారు.

ఇది భారతీయుల సాఫ్ట్ పవర్.న్యూయార్క్‌లో వేడుకలు జరుపుకున్నందుకు అభినందనలని మరో యూజర్ పోస్ట్ చేశారు.

శరన్నవరాత్రి వేడుకలతో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో తెలంగాణ సాంస్కృతిక చిహ్నమైన బతుకమ్మ పండుగను కూడా ప్రవాస భారతీయులు జరుపుకుంటున్నారు.

అలాగే ఇండియన్ కమ్యూనిటీ అంతా ఒకచోటికి చేరి దండియా నృత్యాలతో సందడి చేస్తున్నారు.

చైనా: అందంగా కనిపించాలని ఒకే రోజులో 6 సర్జరీలు చేయించుకుంది.. చివరికేమైందో ఊహించలేరు..!