రెండో రోజు బాల త్రిపురసుందరీ దేవిగా దర్శనం ఇచ్చిన దుర్గమ్మ..!
TeluguStop.com

శరన్నవరాత్రి ఉత్సవాల్లో దుర్గా మాత రెండో రోజు బాల త్రిపుర సుందరీగా దర్శనం ఇచ్చింది.


త్రిపురిని భార్య అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరీ దేవి అని అర్థం.


బాల త్రిపుర సుందరీ దేవిది త్రిగుణైక శక్తి - సరస్వతి విజ్ఞానం, కాళిక శక్తి, లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ఆనంద ప్రదాయిని.
నిర్మల తత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనసు, బుద్ధి, అహంకారం ఈ తల్లి అధీనంలో ఉంటాయి.
అభయ హస్తం, అక్షమాల ధరించిన బాల రూపాన్ని ఆరాధిస్తే నిత్య సంతోషం కల్గుతుందని విశ్వాసం.
షోడస విద్యకు ఈమే అదిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు.
శ్రీ చక్రంలో మొదటి దేవత బాల.అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాల త్రిపుర సుందరీ దేవి భక్తులు పూజలు అందుకుంటుంది.
త్రిపుర సుందరీ అంటే మనలోని మూడు అవస్తలు అయిన జాగృత్, స్వప్న, సుషుష్తికి అధిష్టాన దేవత.
మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థలలోనే తిరుగుతూ ఉంటారు.కేవలం ఉపాధులు మాత్రమే మారుతాయి.
అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంటుంది.ఆత్మ స్వరూపులరాలు అయిన బాలను పూజిస్తే జ్ఞానం, మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది.
అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను త్రిపుర సుందరిగా అలంకరించి పూజ చేస్తారు.
"""/"/
H3 Class=subheader-styleఅమ్మవారి ఆవిర్భావం./h3p
అయితే పురాణాల ప్రకారం.
భండాసురుడు అనే రాక్షసుడికి 30 మంది పిల్లలు ఉండేవాళ్లటు.వీళ్లంతా చదువులేని వాళ్లు.
దేవతలందరినీ తెగ హింసలు పెట్టేవాళ్లట.విషయం తెలుసుకున్న అమ్మవారు.
హంసలు లాగే రథంపై వచ్చి 30 మందిని భండాసుర పుత్రులనూ కేవలం ఒక్క అర్థ చంద్ర బాణంతో సంహరించిందట.
బాలగా కనపడుతున్నా శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచీ బాల ఆరాధన చేయడం ప్రారంభించారు.
వేదికపైనే వధువు ఎదుట వరుడిని కౌగిలించుకున్న యువతి.. వీడియో వైరల్