అంగ రంగ వైభవంగా దుర్గ దేవి నిమజ్జనం వేడుకలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) బోయినపల్లి మండలం కేంద్రం లో దుర్గాదేవి( Durga Devi ) నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి.

మహిషాసుర దాహానాన్ని చూడటానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి తిలకించారు.మండల కేంద్రం లోని రామాలయం లో దేవి ఉత్సావ కమిటీ అద్వర్యం లో దుర్గాదేవి ని ప్రతిష్టించగ దుర్గాదేవి తొమ్మిది రోజుల పాటు భక్తుల కు వివిధ ఆకారం లో దర్శనం ఇవ్వగా భక్తులు విశేష పూజలు నిర్వహించారు.

తొమ్మిది రోజులు పూజలు అందుకున్న దుర్గ దేవిని నిమజ్జనం సందర్భంగా గ్రామం లో ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ తీసుకెళ్లగా మహిళలు మంగళ హారతులు పట్టి దుర్గాదేవికి స్వగతం పలుకుతూ మాత ను దర్శించుకున్నారు.

స్థానిక బస్టాండ్ ప్రాంతం లో మహిషాసుర ( Mahishasura )దహనం కార్యక్రమాము నిర్వహించగా తిలకించడానికి భక్తులు అధికసంఖ్యలో హాజరయ్యారు.

బాబాయ్ హత్యపై అన్నను నిలదీస్తున్న షర్మిల