మధ్యాహ్నం ఎంతసేపు నిద్రపోతే ఏమవుతుంది..?

మధ్యాహ్నం నిద్రపోవడం చాలామందికి ఉండే అలవాటు.ఇది ఓ పద్ధతిలో ఉంటే చాలా మంచి అలవాటు కూడా.

మధ్యాహ్నం పనులు లేకపోతే భేషుగ్గా కాసేపు కనుకు తీయవచ్చు.అయితే ఎంతసేపు నిద్రపోవాలో, ఎన్ని నిమిషాలు పడుకుంటే ఎలాంటి లాభాలుంటాయో తెలుసా?.

* మధ్యాహ్నం గంటన్నరకి ఎక్కువ పడుకోకూడదు అని అంటారు.దానికి కారణాలు చాలానే ఉన్నాయి.

ఒకటి రాత్రి నిద్రపట్టడం కష్టమైపోతుంది.లేదంటే అతినిద్ర వలన అధికబరువు, డయాబెటిస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి.

అదే గంటన్నరపాటు నిద్రపోతే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.* రిఫ్రెష్ మెంట్ కోసం ఓ గంట నిద్ర చాలు అని అంటారు.

మెదడు కూడా చురుకుగా పనిచేస్తుంది గంటసేపు నిద్ర తరువాత.* అరగంట నిద్ర అలసటను దూరం చేస్తుంది.

రాత్రి నిద్రపట్టకపోతే, వర్క్ ప్రెషర్ మధ్యలో ఉంటే, అరగంట నిద్ర బాగా ఉపయోగకరం.

* ఇరవై నిమిషాల నిద్ర ఎనెర్జెటిక్ గా ఫీల్ అయ్యేలా చేస్తుందని పరిశోధకులు చెబుతారు.

ఆఫీసు లంచ్ బ్రేక్ లో ఈ నిద్ర పనికివస్తుంది.* రోజంతా పని ఉంటే, మధ్యమధ్యలో పదినిమిషాలు నిద్రపోవడం చాలా మంచిది.

ఏకధాటిగా పనిచేస్తే ఏకాగ్రత దెబ్బతినవచ్చు.అలాంటప్పడు ఇలా బ్రేక్స్ ఇస్తూ పది నిమిషాల కునుకు తీయడం మంచిది.

భద్రాద్రి జిల్లాలో గన్ మిస్ ఫైర్ .. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి