Shah Rukh Khan : ఏదో అనుకుంటే తుస్ మనిపించిన షారుఖ్ ఖాన్.. సలార్‌కి ఫుల్ ప్లస్..
TeluguStop.com
పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) మళ్లీ ఇప్పుడు డన్కీ లేదా డంకి సినిమాతో( Dunki Movie ) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
డిసెంబర్ 21న రిలీజ్ అయిన ఈ సినిమాతో షారుఖ్ తప్పకుండా హ్యాట్రిక్ హిట్ కొడతాడని చాలామంది బలంగా నమ్మారు.
ఎందుకంటే ఈ మూవీని త్రీ ఇడియట్స్, సంజు, మున్నాభాయ్, పీకే వంటి గొప్ప సినిమాలు తీసిన రాజకుమార్ హిరాణీ రూపొందించాడు.
ఐతే ప్రేక్షకులు అనుకున్నంత రేంజ్ లో ఈ మూవీ లేదు.ఈ సినిమా మరీ ఫెయిల్, డిజాస్టర్ కాదు, అలాగని షారుఖ్, రాజకుమార్ హిరాణీ రేంజ్‌కి తగిన బ్లాక్ బస్టర్ హిట్ కూడా కాదు.
ఎందుకంటే ఈ సినిమాలో వారిద్దరి మార్క్ అసలే లేదు.షారుఖ్ ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పి హైప్ పెంచాడు కానీ ఈ మూవీకి అంత సీన్ లేదని ఫస్ట్ షోతోనే రుజువయింది.
"""/" /
ఈ సినిమా స్టోరీ చాలా వీక్ ఉంది.చదువు లేని ఐదుగురు ఫ్రెండ్స్ లండన్ లో ఉండలేక తిరిగి ఇండియాకి రావాలనుకోవడమే ఈ సినిమా కథాంశం.
కాకపోతే వారికి ఇండియాకి తిరిగి వచ్చే అర్హత ఉండదు కానీ అక్రమంగా రావాలనుకుంటారు.
ఆ అక్రమ ప్రవేశాన్నే డన్కీ అంటారట.డన్కీ పదాన్ని ఫైట్ అని కూడా ట్రాన్స్‌లేట్ చేస్తున్నారు.
ఇక రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, జియో స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ కామెడీ డ్రామా ఫిలిం తెలుగు వారికి అసలే కనెక్ట్ కాలేదు.
ఆ అక్రమ జొరబాటుదార్ల కథలను కాస్త రెట్టికట్టేలా చూపించినట్లయితే సినిమాకి మరింత రెస్పాన్స్ వచ్చి ఉండేదేమో.
"""/" /
కాకపోతే ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్ లేకపోవడం, షారుఖ్ ఖాన్ యాక్టింగ్, తాప్సీ పన్నుతో( Taapsee Pannu ) కెమిస్ట్రీ అని చెప్పుకోవచ్చు.
అందులో కొన్ని హిలేరియస్ సన్నివేశాలు కూడా ఉన్నాయి.మొత్తం మీద ఈ మూవీ పాస్ అవడం ఖాయం.
సినిమా చూసి థియేటర్‌లో నుంచి బయటికి వచ్చే ప్రతి ప్రేక్షకుల్లో తప్పనిసరిగా సంతృప్తి ఉంటుంది.
ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి.త్వరలో ఈ సినిమాకి పోటీగా సలార్ ( Salaar )రిలీజ్ అవుతుంది.
డన్కీ మొత్తం కలెక్షన్లను లాగేసేంత గొప్ప సినిమా లాగా లేదు కాబట్టి అది సలార్ మూవీకి పెద్ద ప్లస్ అవుతుంది.
ఆ మూవీ బాగుంటే షారుఖ్ ఖాన్ మూవీ కలెక్షన్లపై ప్రభావం పడే అవకాశం ఉంది.
లేదంటే డన్కీ సినిమా కలెక్షన్ల పై ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్ పడదు.సలార్ బాగో లేకపోతే యానిమల్ సినిమా కూడా బాగానే కలెక్షన్లను దండుకుంటుంది.
రూ.120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన షారుఖ్ డన్కీ ఆ డబ్బును వన్ వీక్ లోనే రాబట్టుకుంటుందని అనడంలో సందేహం లేదు.
ఓటీటీలో దేవర రిజల్ట్ ఏంటి.. ఈ ప్రశ్నకు సులువుగానే జవాబు దొరికేసిందిగా!