ఆ ఊరిలో పిడకల సమరం.. ఎక్కడంటే..?

మనం అప్పుడప్పుడు వివిధ ప్రాంతాల్లో జరిగే కొన్ని ప్రత్యేకమైన ఆచారాలను గమనిస్తూనే ఉంటాం.

ముఖ్యంగా పెళ్లి పనులలో, లేకపోతే దేవుని కార్యక్రమాలలో ఇలాంటి వింత వింత ఆచారాలు మనం వార్తలలో వింటూనే ఉంటాం.

ఇక అసలు విషయంలోకి వెళితే కర్నూలు జిల్లాలోని ఆదోని డివిజన్ ప్రాంతంలో ఉన్న అప్సరి మండలం కైరుప్పల గ్రామంలో ఉన్న వీరభద్ర స్వామి జాతర ఉత్సవాల్లో భాగంగా జరిగే పిడకల సమరం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరుగాంచింది.

ఈ వేడుకలో చూడడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మాత్రమే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారు.

ఈ ఉత్సవాలు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మరుసటి రోజు పీడకల సంబరాన్ని గ్రామస్తులు నిర్వహిస్తారు.

చాలా సంవత్సరాల నుంచి ఆ ఊర్లోనే పెద్దలు ఈ ఆచారాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు.

ఈ పిడకల సమరం కోసం మండలంలోని పలు పల్లెటూర్లలో ఉన్న గ్రామస్తులు గత నెలరోజుల నుంచి నియమనిష్టలతో, భక్తిశ్రద్దలతో ప్రత్యేకంగా పిడకలను తయారు చేస్తారు.

ఇలా తయారు చేసిన పిడకలను ఆయా గ్రామస్తులు ప్రత్యేకంగా వాహనంలో ఊరేగింపుగా గ్రామానికి చేరుస్తారు.

ఇక ఉగాది మరుసటి రోజున కైరుప్పల గ్రామస్తులు మొత్తం రెండు వర్గాలుగా విడిపోయి సమరానికి సిద్ధమైపోతారు.

ఒకవేళ ఈ పిడకల సమరంలో భక్తులకు ఎవరికైనా గాయాలైతే కనుక వీరభద్ర స్వామి విభూదిని రాసుకుంటే చాలా త్వరగా నయం అవుతాయని అక్కడి భక్తుల విశ్వాసం.

ఇకపోతే ఈ పిడకల సంబరానికి ఓ పురాతన కథ కూడా ఆయా పల్లెటూరి జనాలు చెప్పుకుంటూ ఉంటారు.

"""/"/ ఇక ఈ సంబరానికి ముందుగా కారుమంచి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి వంశస్థులు వీరభద్ర స్వామి ఆలయంలో పూజలు చేసిన తర్వాతే కార్యక్రమం మొదలవుతుంది.

ఇక కారుమంచి లో ఉన్న రెడ్డి వంశస్థులు ఆనాటి రాజరికాన్ని తలపించేలా వారు పూజలు నిర్వహిస్తారు.

ఆ వంశం లో పెద్ద అయిన వ్యక్తి తలపై పాగా చుట్టుకొని యుద్ధ కత్తి చేత పట్టుకొని గుర్రంపై వస్తూ ఆయనతోపాటు అనేకమంది రావడ వారితో పాటు మేళతాళాలు రావడం అక్కడ సాంప్రదాయంగా జరుగుతున్న ప్రక్రియ.

నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్ భారత్ లో లాంఛ్.. ధర, ఫీచర్లు ఇవే..!