స్నేహితులతో సరదాగా హోలీ సంబరాలు.. కట్ చేస్తే అటవీ ప్రాంతంలో దారుణ హత్య..!
TeluguStop.com
ఇటీవలే కాలంలో బయటకు వెళ్లిన వ్యక్తి ఇంటికి వస్తాడో.రాడో చెప్పలేని పరిస్థితులలో బతుకుతున్నాం.
బయటకు వెళ్లి కనుమరుగవడం, శవంగా మారడం లాంటి సంఘటనలు క్రమంగా పెరిగి కుటుంబలకు తీవ్ర శ్రోకాన్ని మిగిలిస్తున్నాయి.
ఒక యువకుడు స్నేహితులతో కలిసి సరదాగా హోలీ సంబరాలు జరుపుకొని.సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురైన సంఘటన కుత్బుల్లాపూర్ లోని దుండిగల్ లో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుండిగల్ పరిధిలో ఉండే రాజీవ్ గృహకల్ప లో వినయ్ అనే 26 సంవత్సరాల యువకుడు దారుణంగా హత్యకు గురయ్యాడు.
"""/" /
హోలీ రోజు సరదాగా స్నేహితులతో కలిసి హోలీ సంబరాలు జరుపుకొని ఒంటి నిండా గాయాలతో ఇంటికి వచ్చాడు.
కాసేపటికి స్నేహితులు ఇంటికి వచ్చి వినయ్ ను బలవంతంగా బయటకి తీసుకెళ్లారు.తర్వాత జ్యోతి మిల్క్ సమీపంలో ఉండే అటవీ ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు.
ఇంటి వద్ద ఉండే వినయ్ ను బలవంతంగా తీసుకెళ్లిన స్నేహితులే హత్య చేసి ఉంటారని వినయ్ తల్లి ఆరోపించారు.
మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.
"""/" /
వినయ్ హత్య గురించి పోలీసులు విచారణ జరిపితే అందులో వినయ్ దుండిగల్ లోని ఓ ఫ్యాన్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు.
ఇక తన స్నేహితులతో కలిసి మందు కొట్టడం, గంజాయి సేవించడం లాంటివి చేస్తూ ఉండేవాడు.
అంతే కాకుండా వినయ్ పై బాలానగర్ పోలీస్ స్టేషన్ లో అత్యాచారం కేసులో నిందితుడుగా ఉన్నటు పోలీస్ రికార్డు ఉంది.
ఉద్దేశపూర్వకంగానే వినయ్ ను హత్య చేసి ఉంటారని భావిస్తూ హత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు.
రాజమౌళి మహేష్ బాబు సినిమా పాన్ వరల్డ్ లో వర్కౌట్ అవుతుందా..?