సెన్సార్ పూర్తి చేసుకున్న ‘కింగ్ ఆఫ్ కోత’.. దుల్కర్ కు మరో హిట్ అందుతుందా?

మలయాళ స్టార్ హీరోల్లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్ ( Dulquer Salmaan ) ఒకరు.

ఇతడు పాన్ ఇండియా వ్యాప్తంగా ఫేమస్ అవ్వడంతో దుల్కర్ సినిమాలు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి.

ఎంతో కస్టపడి దుల్కర్ పాన్ ఇండియా వ్యాప్తంగా పేరు తెచ్చుకుని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.

ఈ యంగ్ హీరో సినిమాలంటే అన్ని బాషల ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. """/" / ఈ క్రమంలోనే ఇతడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

ప్రజెంట్ దుల్కర్ సల్మాన్ నటించిన మూవీ రిలీజ్ కు సిద్ధం అయ్యింది.''కింగ్ ఆఫ్ కోత'' ( King Of Kotha ) అనే సినిమా ఆగస్టు 24న రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమా కోసం అంతటా బాగానే ప్రమోషన్స్ చేస్తున్నారు.ఇక తెలుగులో కూడా ఓపెనింగ్స్ బాగా రాబట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

దీంతో ఇక్కడ కూడా డీసెంట్ బజ్ నెలకొంది.గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు వర్షన్ లో సెన్సార్ పూర్తి చేసుకుంది.

తెలుగులో ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డు వారు అందించింది.

మొత్తానికి అన్ని పనులు పూర్తి చేసుకుంటూ రిలీజ్ కు రెడీ అయ్యింది.ఈ సినిమాను అభిలాష్ జోషి డైరెక్ట్ చేయగా రితికా సింగ్, ఐశ్వర్య లక్ష్మి ( Aishwarya Lekshmi ) హీరోయిన్ లుగా నటించారు.

"""/" / జేక్స్ బిజోయ్ సంగీతం అందించఫ ఈ4 మూవీస్ అండ్ జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు.

సీతారామం ( Sita Ramam )వంటి సెన్సేషనల్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత సినిమాతో కూడా మంచి హిట్ అందుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు.

మరి ఈ యంగ్ హీరో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

వరలక్ష్మి పెళ్లి ఖర్చు 200 కోట్లు… షాకింగ్ న్యూస్ చెప్పిన తండ్రి శరత్ కుమార్!